Site icon NTV Telugu

Jyoti Malhotra: “ఆపరేషన్‌ సిందూర్‌” సమాచారం లీక్ చేసిన జ్యోతి మల్హోత్రా!

Jyoti Malhotra

Jyoti Malhotra

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఇటీవల హర్యానా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని పేజీలు పాకిస్థాన్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని, అక్కడి పర్యటన అనుభవాలను వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా విచారిస్తున్నారు. కాగా.. నేటితో జ్యోతి మల్హోత్రా పోలీస్‌ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. తాను పాకిస్థాన్ గూఢచారిని అని ఆమె అంగీకరించింది. విచారణ అధికారులు ఎదుట నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.

READ MORE: Kothalavadi: యష్ తల్లి నిర్మాతగా ‘కొత్తలవాడి’ .. టీజర్ భలే ఉందే!

తాజాగా పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కూడా జ్యోతి పాక్‌కు సమాచారం చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో పాక్‌ సరిహద్దు రాష్ట్రాలను వైమానిక, క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాకౌట్లు నిర్వహించింది. ఈ సమాచారం కూడా ఆమె డానిష్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం ఆమె నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకొన్నాయి. దీంతోపాటు.. ఆమెకున్న రెండు బ్యాంకు ఖాతాలను కూడా విశ్లేషిస్తున్నాయి.

READ MORE: Kothalavadi: యష్ తల్లి నిర్మాతగా ‘కొత్తలవాడి’ .. టీజర్ భలే ఉందే!

Exit mobile version