తమిళ స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది… తెలుగులో కూడా ఈమె సినిమాలు డబ్ అవుతున్నాయి. దాంతో ఇక్కడ జనాలకు కూడా సుపరిచితమే.. ఇక ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా తన సత్తాను కొనసాగిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ముంబైకు మాకాం మార్చిన జ్యోతిక అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. సైతాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జ్యోతిక మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అదే జోష్ లో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. ముంబై కి షిఫ్ట్ అయ్యాక జ్యోతిక స్టైల్ మార్చేసింది… ఎప్పుడు పద్దతిగా కనిపించే ఈ అమ్మడు తాజాగా ట్రెండీ వేర్ లో అదరగొట్టింది..
స్టైలిష్ లుక్ తో పాటుగా మెడలో ధరించిన నగ కూడా అందరిని ఆకట్టుకుంది.. లైట్ మేకప్ తో హైహిల్స్ తో స్టిల్స్ దిగింది… ఆ ఫోటోలు సోషల్ తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ వైపు లేడీ ఓరియంటెడ్ లు చేస్తూనే స్టార్ హీరోలతోనూ జోడి కడుతున్నారు జ్యోతిక.. మొత్తానికి అక్కడ కూడా అమ్మడు పాగా వేసింది… ఇక నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి..