Bombay High Court: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ జస్టిస్ ఉపాధ్యాయ్‌తో ప్రమాణం చేయించారు. దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ)గా పదోన్నతి పొందక ముందు అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జిగా ఉన్నారు.
Also Read: Buddhadeb Bhattacharya: బెంగాల్ మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
మే 30న సీజే ఆర్డీ ధనుక పదవీ విరమణ చేయడంతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉంది. ఆ తర్వాత జస్టిస్ నితిన్ జామ్దార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం సీజేగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ నియామకమయ్యారు. జూన్ 16, 1965లో జన్మించిన దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ 1991లో లక్నో విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.