NTV Telugu Site icon

TS High Court: తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణం

Ts Hc Cj

Ts Hc Cj

తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు జస్టిస్‌ అలోక్‌ అరాధేతో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక, ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్‌ అలోక్‌ అరాధే వచ్చారు.

Read Also: AP BJP : నేటి నుంచి ఏపీ బీజేపీ జోనల్‌ సమావేశాలు

ఈమేరకు సుప్రీం కొలీజియం సిఫార్సులకు కేంద్ర న్యాయ శాఖ గత వారం ఆమోదం తెలుపుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ బాధ్యతలు తీసుకున్నారు. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ అలోక్‌ అరాధే 1964, ఏప్రిల్‌ 14న రాయ్‌పూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ఆయన 1988లో న్యాయవాదిగా పని చేశారు. 2007లో సీనియర్‌ న్యాయవాదిగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించారు.

Read Also: Manipur Violence: మణిపూర్‌లో అరాచకాలెన్నో.. ఒక్కొక్కటిగా బయటికి

అయితే, 2009 డిసెంబర్‌ 29న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2016, సెప్టెంబర్‌ 16న జమ్మూకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా కొన్ని రోజులు పని చేశారు. ఇక, 2018, నవంబర్‌ 17న కర్ణాటక హైకోర్టులో కూడా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.

Read Also: Seema Haider: ఐఎస్‌ఐకి సీమా హైదర్ భయపడిందా.. భారత్‌లో ఆశ్రయానికి సచిన్‌ను పావుగా వాడుతోందా?

తెలంగాణ హైకోర్టు ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు సీజేలుగా పనిచేశారు. గత నాలుగేళ్లలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్‌ రాధాకృష్ణన్, జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇక్కడ పనిచేశారు. ఇక, జస్టిస్‌ అలోక్‌ అరాధే తెలంగాణ హైకోర్టులో ఆరో సీజేగా వచ్చారు. వీరిలో జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.