Daily Exercise 5 Minutes: నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమస్యలు గణనీయంగా పెరిగాయి. ఈ రోజుల్లో రక్తపోటు అనేది అతి పెద్ద ఆరోగ్య సమస్య. దీంతో ఒక్క భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. క్రమరహిత ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ సమస్య అన్ని వయసులవారిలో నిరంతరం పెరుగుతోంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలాలు ఇంకా చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. నిజానికి మన ఆరోగ్యంలో 80 శాతం మన చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా మనం సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరిస్తే ఇది చాలా సులభం.
Read Also: Student Cheated: జగత్ కిలాడీ.. 200 మందిని మోసం చేసి రూ.45 లక్షలను కాజేసిన 11వ తరగతి విద్యార్థి
అందువల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు బీపీ, షుగర్ వంటి సమస్యలు 70, 60 ఏళ్ల వయసులో మాత్రమే కనిపించేవి. అయితే, ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. ఉప్పు, పంచదార ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి కూర్చొని పనిచేసేవారిలో బీపీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బీపీతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, రోజూ 5 నిమిషాలు మాత్రమే వ్యాయామం చేయడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. రోజూ 30 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయామం చేసే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇదివరకే అనేక పరిశోధనలు తెలిపాయి.
Read Also: Diabetes: ఏ విటమిన్ లోపిస్తే మధుమేహం వస్తుందంటే?
తాజాగా వచ్చిన బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ వారి అధ్యయనం ప్రకారం , ప్రతిరోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం చేయడం రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తేలింది. ఇది మాత్రమే కాదు, వేగవంతమైన, కఠినమైన వ్యాయామాలు చేయడం కంటే ప్రతిరోజూ చిన్న వ్యాయామాలు చేయడం రక్తపోటును తగ్గించడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. ఈ నివేదిక ప్రకారం.. పరిశోధనను లండన్ విశ్వవిద్యాలయం, సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేశారు . అదనంగా 5 నిమిషాల వ్యాయామం ఒక వ్యక్తి రక్తపోటును ప్రభావితం చేస్తుందో లేదో నిర్ణయించడం ఈ అధ్యయనం ఉద్దేశ్యం. పరిశోధకులు 24 గంటల్లో 15,000 మందిని పర్యవేక్షించారు. దీని తర్వాత సైక్లింగ్ లేదా మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాన్ని కేవలం 5 అదనపు నిమిషాల పాటు జోడించిన వ్యక్తులు వారి రక్తపోటు స్థాయిలలో గణనీయమైన మెరుగుదలను కలిగి ఉన్నారని ఫలితాలు చూపించాయి.