NTV Telugu Site icon

Jupally Krishna Rao : అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు

Jupally Krishna Rao

Jupally Krishna Rao

పార్టీ ఫిరాయింపుల‌నై మాట్లాడే నైతిక హ‌క్కు బీఆర్ఎస్ నాయ‌కుల‌కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ల స్ఫూర్తిని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని, అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టుప‌ట్టించాడన్నారు. తెలంగాణ వ‌స్తే చాలు- మ‌రే ప‌ద‌వి వ‌ద్ద‌న్నాడని, జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను విస్త‌రించి.. ప్ర‌ధాని కావ‌ల‌ని క‌ల‌లు క‌న్నాడన్నారు. సార్.. కారు.. పదహారు అన్నావు… పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న సీట్లు పోయాయి. డిపాజిట్లు కూడా రాలేదన్నారు మంత్రి జూపల్లి. పూర్తి మెజార్టీ ఉండి కూడా.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆనాడు తన పార్టీలో చేర్చుకున్నాడని, విలువలు ఉండి ఉంటే ఆనాడు.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీ లో చేర్చుకుని విలీనం చేసే వాడు కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని.. బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడారని, అధికారంలో ఉన్నపుడు బీజేపీ పార్టీతో అంటకాగారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

అంతేకాకుండా.. ‘బీజేపీ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసిన బీఆర్ఎస్ పార్టీ ని.. ఆ ఎమ్మెల్యేలు వీడుతున్నారు. సుస్థిర ప్ర‌భుత్వం కోస‌మే… ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రభుత్వాన్ని కులుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రజా ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవిని వదులుకున్నారు. వారిని విమర్శించే స్థాయి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నిరంజన్ రెడ్డి లేఖ రాయాల్సింది రాహల్ట్ గాంధీ కి కాదు.. బీజేపీ తో కుమ్మకు అయినప్పుడు, రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలోకి తొక్కినప్పుడు. కేసీఆర్ కు లేఖ రాసి ఉండాల్సింది. కేసీఆర్, నిరంజన్ రెడ్డి లాంటి వారి వారు చేసిన నిర్వాకాల వల్లే ప్రజలు వారిని తిరస్కరించారు. గతంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే… ఇప్పుడు ఎట్లా ఉందో ప్రజలకు తెలుసు. రాష్ట్రాన్ని మాత్రం అప్పులకుప్పగా మార్చారు. నీ అవినీతి, అక్రమాలు, కబ్జాల గురించి ప్రజలకు తెలుసు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను ఓడించారు. ఇకనైనా తప్పుడు పిచ్చి మాటలు, తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. శంకర్, షాద్ నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు ప్ర‌తిపక్షంలో ఉన్న‌ప్పుడు విలువ‌ల గురించి మాట్లాడ‌టం.. ద‌య్యాలు.. వేదాలు వ‌ల్లించిన‌ట్లు ఉంది, మీరు చేస్తే సంసారం… అదే మేము చేస్తే వ్యభిచారము?, ఇచ్చిన తెలంగాణను ఆగమాగం చేశారు. బీర్ఎస్ పార్టీకి మనుగడ లేదని కార్యకర్తల భావిస్తున్నారు. అందుకే. వారి అభీష్టం మేరకే .. ఆ పార్టీనీ వీడి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
విభజన సమస్యల పరిష్కారానికే ఇరు రాష్ట్రాల సీఎం లు సమావేశమయ్యారు..’ అని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు.