NTV Telugu Site icon

Jupally Krishna Rao : సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయం.. కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల పార్టీ

Jupally Krishna Rao

Jupally Krishna Rao

నిజామాబాద్ జిల్లాలో నుడా చైర్మన్ కేశ వేణు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ వన్ పరీక్షల విషయంలో బీఆర్‌ఎస్‌ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను మాసకబార్చే ప్రయత్నం చేసారు.. కానీ పరీక్షలకు అనుమతి లభించిందన్నారు మంత్రి జూపల్లి. సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా పై సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక మక్కువ ఉందని, జిల్లాకు అత్యధికంగా కేటాయించిన నామినేటెడ్ పోస్టులే ఇందుకు నిదర్శనమన్నారు.

IMD Big Alert: దూసుకొస్తున్న తుఫాన్.. ఈ రాష్ట్రాలకు అత్యంత భారీ వర్ష సూచన

రాష్ట్ర ప్రభుత్వం పై కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం జరుగుతుందని, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవాలన్నారు. గడిచిన పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పర్తిస్థితి అధ్వాన్నంగా తయారు చేసారు బీఆర్‌ఎస్‌ నాయకులు అని, కేసీఆర్ హయంలో ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. వారు చేసిన అప్పులకు నెలకు 6వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని, ఎంత భారం అయినప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తుందన్నారు జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ ఒక నియంతల పరిపాలించాడు కాబట్టే ప్రజలు సరైన బుద్ధి చెప్పారని, రానున్న గ్రాద్యువేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రతి పక్షాల నోళ్ళు ముయించాలన్నారు.

Actress Shabrin: మేనమామతో ప్రేమాయణం.. మేనల్లుడి కిడ్నాప్ కేసులో నటి అరెస్ట్