దేశంలోని రెండు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాళాతంలో ఏర్పడిన తుఫాన్ ఈనెల 23న తీరం దాట నుంది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని వివిధ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం నమోదు అవుతుందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని పూరీ, ఖుర్దా, గంజాం, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
ఇది కూడా చదవండి: Supreme Court: ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. విచారణ వాయిదా
భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు స్పష్టం చేశాయి. ఫైర్ సర్వీస్, శాంతిభద్రతల అదనపు డీజీతో సమీక్ష నిర్వహిస్తామని ఒడిశా రెవెన్యూ విపత్తు నిర్వహణ మంత్రి సురేష్ పూజారి తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని.. కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: Nandigam Suresh: మహిళ హత్య కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు 14 రోజుల రిమాండ్!