ప్రతి నెల కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న రానున్నాయి.. ప్రతి నెల నెల కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తుంటాయి.. మరో నాలుగు రోజుల్లో జూలై నెల ప్రారంభం కానుంది.. వచ్చే నెల కూడా కొన్ని మార్పులు రానున్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం..
వంట గ్యాస్.. ఎల్పీజీ సిలెండర్ ధరలు, సీఎన్జీ-పీఎన్జీ గ్యాస్ ధరల విషయంలో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ సిలెండర్ ధరలపై సమీక్ష చేస్తుంటుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లోని ఒకటవ తేదీన కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరల్ని తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. డొమెస్టిక్ గ్యాస్ ధరల్ని తగ్గించలేదు. ఈసారి కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరలతో పాటు డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరల్ని తగ్గించవచ్చునని తెలుస్తుంది..
ఇక క్రెడిట్ కార్డ్స్.. జూలై 1, 2023 నుంచి విదేశాల్లో క్రెడిట్ కార్డు ఖర్చులపై టీసీఎస్ వసూలు చేసే అవకాశముంది. ఈ నిబంధన ప్రకారం ఒకవేళ మీ ఖర్చు 7 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 20 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. విద్యా వైద్య ఖర్చులపై 5 శాతం టీసీఎస్ వసూలు చేయనున్నారు. విదేశాల్లో చదువు నిమిత్తం అప్పు తీసుకునే ట్యాక్స్ పేయర్ల పై రూ. 7 లక్షల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం టీసీఎస్ 0.5 శాతం వసూల్ చేస్తారు….
ప్రతి నెల ఒకటో తారీఖు వస్తే ఎల్పీజీ గ్యాస్ ధరల్లానే సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరల్లో మార్పు ఉండవచ్చు. ఢిల్లీ, ముంబై సహా ఇతర నగరాల్లో ఆయిల్ కంపెనీలు మొదటి వారంలోనే సీఎన్జీ-పీఎన్జీ థరల్లో మార్పులు చేయవచ్చు.. అన్నిటికన్నా ముందు గ్యాస్ ధరలు మాత్రం నెల నెల పెరుగుతూనే ఉన్నాయి.. మరి వచ్చే నెల గ్యాస్ ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పడతాయో.. లేదా ఊరట కలిగిస్తాయా అనేది చూడాలి.. ఏది ఏమైనా ప్రస్తుతం కూరగాయల ధరలు రోజూ రోజుకు పెరుగుతున్నాయి.. కనీసం జూలై నుంచి అయిన ధరలు కాస్త తగ్గుతాయేమో చూడాలి..