NTV Telugu Site icon

Julakanti Ranga Reddy : కేసీఆర్‌ వామపక్షాలను విస్మరించడం సరికాదు

Julakanti Ranga Reddy

Julakanti Ranga Reddy

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీఆర్‌ఎస్ సోమవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఎలాంటి లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థుల పేర్లను ఎన్నికల తేదీకి కనీసం 3 నెలల ముందుగానే ప్రకటించారు. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాలో తొమ్మిది మార్పులు మాత్రమే కనిపించాయి, అందులో రెండు టిక్కెట్లు రాజకీయ బాధ్యతల కారణంగా వారి కుటుంబ సభ్యులకు బదిలీ చేయబడ్డాయి. అవి సికింద్రాబాద్ కంటైన్‌మెంట్‌ కాగా మరోటి కోరుట్ల. తొలగించబడిన ఆరుగురు అభ్యర్థులు ఏదో ఒక రూపంలో అధికార వ్యతిరేకత, అనైతిక ప్రవర్తన ఆరోపణలు లేదా కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు.

Also Read : Fraud: ఇస్రో రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో మోసం.. ఇద్దరు అరెస్ట్

ఈ నియోజకవర్గాలు ఉప్పల్, స్టేషన్ ఘన్‌పూర్, వైరా, ఖానాపూర్, వేములవాడ, బోథ్. అయితే ఇదే సమయంలో పొత్తులపై కూడా సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. ఎవ్వరితోనీ పొత్తులేకుండానే రానున్న ఎన్నికలకు పోతున్నట్లు వివరించారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికల నుంచి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్‌.. ఆ పొత్తు ఈ ఎన్నికలకు వరకు కూడా కొనసాగిస్తారని సీపీఎం, సీపీఐ నాయకులు భావించారు. కానీ.. వారి ఆశలకు నేటితో తెరలేపారు కేసీఆర్‌. అయితే.. ఈ నేపథ్యంలోనే.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సీపీఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

Also Read : Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్ ఎవరండీ..? ఆయనకు ‘పుష్ప’ సినిమా చూపించాలేమో..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల అవసరం ఉందని కేసీఆర్ వామపక్షాల సహాయం తీసుకున్నారని, అవసరం తీరాక ఇన్నాళ్లు మభ్యపెడుతూ మొండిచేయి చూపించారని సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ వామపక్షాలను విస్మరించడం సరికాదని ఆయన హితవు పలికారు. వామపక్షాలతో కలిసి ఉంటామని చెప్పిన కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం అతని అవకాశవాదానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
కేసీఆర్ చేసిన మోసానికి వామపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు నిరుత్సాహ పడొద్దని, అవకాశవాద పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు.