NTV Telugu Site icon

Vinesh Phogat: వినేశ్ ఫొగట్ అప్పీల్పై ఈరోజు రాత్రి తీర్పు..!

Vinesh

Vinesh

అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.. కాగా.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు రాత్రి 9:30 గంటలలోపు తీర్పు వెలువడే అవకావం ఉంది. కాగా.. ఈ తీర్పు కోసం భారతదేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆమెకు మెడల్ రావాలని కోరుకుంటున్నారు. కాగా.. 50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరినందుకు కంబైన్డ్ సిల్వర్ మెడల్ ఇవ్వాలని వినేష్ ఫొగట్ విజ్ఞప్తి చేసింది.

Read Also: PM Modi: మోడీ చేసిన ఒక్క ప్రకటనతో దూసుకుపోయిన మార్కెట్..

కాగా.. ఓవర్ వెయిట్ కారణంగా పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 ఫైనల్‌లో ఆడకుండా అనర్హత వేటు పడడంతో నిరుత్సాహానికి గురైన వినేష్ ఫొగట్ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పారు. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్‌కు చేరి.. పతకం ఖాయం చేసుకున్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు వేశారు. 50 కేజీల విభాగంలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండడంతో ఒలింపిక్‌ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వినేశ్‌ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది.

Read Also: Bandi Sanjay: సిసోడియాకి మేం బెయిల్ ఇచ్చామా..? కవితకు ఇవ్వడానికి..

అయితే ఫైనల్‌లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్‌ ఫొగాట్‌ తలపడాల్సి ఉండేది. కాగా.. మంగళవారం రాత్రే తాను ఎక్కువ బరువు ఉన్నానని తెలుసుకుని.. బరువు తగ్గడం కోసం చాలా వర్కౌట్స్ చేసింది. నిద్రాహారాలు మానేసి.. స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేసింది. దాంతో రాత్రే కేజీకి పైగా బరువు తగ్గారు. అయినప్పటికీ 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో అనర్హత వేటు పడింది.