Hyderabad: “చచ్చిపోతామనుకున్నాం.. కానీ!”.. అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన కార్మికుల ఆవేదన..

Jubilee Hills Road No 36

Jubilee Hills Road No 36

Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్‌ 36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భవనంలో షాపింగ్ మాల్‌ సిబ్బంది చిక్కుకోగా వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది వారిని రక్షించారు. పై ఫ్లోర్లో కార్మికులు వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఎలివేషన్ కట్టడంపై పడటంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు అదుపులోకి వచ్చాయి..

READ MORE: Amit shah: చొరబాటుదారుల్ని దేశం నుంచి తొలగిస్తాం.. బీహార్ నుంచే ప్రారంభిస్తామన్న అమిత్ షా

ఇందులో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. అగ్ని ప్రమాద సమయంలో మూడో అంతస్తులో మహిళలు పని చేస్తున్నారు. ఐదో అంతస్తులో నలుగురు కార్మికులు పని చేస్తున్నారు.. మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో మహిళలు అరుపులు, కేకలు పెట్టారు. ఐదవ అంతస్తులో ఉన్న ఒక మహిళ భర్త రాజు మూడో అంతస్తుకు వచ్చాడు. మూడవ అంతస్తులోని అద్దాలను పగలగొట్టాడు రాజు.. భవనం వెనుక పై వైపు నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు.. అద్దాలను పగల కొట్టడంతో నిచ్చెన సాయంతో కిందికి వచ్చారు మహిళలు. ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మికుడు రాజు ఈ అంశంపై ఎన్టీవీతో మాట్లాడారు. “మొదటి అంతస్తులు తాపీ పని చేయడానికి నాతోపాటు మరో ముగ్గురు వచ్చారు.. నాలుగో ఫ్లోర్లో ఆ సెట్టింగ్ తీసేయడానికి మరొక నలుగురు వచ్చారు.. 10:30కు ఒకసారిగా పొగలు ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చాయి.. నల్లటి పొగ రావడంతో ఎటుపోవాలని తెలియలేదు .. సచ్చిపోతామని అనుకున్నాము.. నాలుగో ఫ్లోర్ వరకు వెళ్ళాం.. నాలుగో ఫ్లోర్‌కు పోయే సరికి నల్లటి పొగ ఎక్కువగా వచ్చింది.. మొత్తం నల్లటి పొగ ఉండటంతో ఎటు వెళ్ళాలో తెలోయలేదు.. సెట్టింగ్ తొలగించడానికి వచ్చిన నలుగురు పక్క బిల్లింగ్ పైకి దూకి వెళ్లిపోయారు.. మాతో పాటు వచ్చిన మరొక ముగ్గురు నేను కలిసి గ్లాస్ డోర్ పగలగొట్టుకొని వచ్చాం.. చచ్చిపోతామని అనుకున్నాం.. ఎలాగోలా బతికాం..” అని వెల్లడించారు.

READ MORE: IND vs ZIM Super 8: భారత్‌కు అంత సీన్ లేదు, ఓడిపోతుంది.. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!