Site icon NTV Telugu

Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లలో బిగ్ ట్విస్ట్.. చివరి రోజు భారీగా..!

Hyd

Hyd

Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజున భారీ హడావుడి నెలకొంది. నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా పోటీకి రంగంలోకి దిగుతున్నారు. ఓవైపు నిరుద్యోగులు తమ సమస్యలను బట్టబయలు చేసేందుకు నామినేషన్లు వేస్తుండగా, మరోవైపు ఫార్మాసిటీ, RRR ప్రాజెక్టుల బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమ భూములు కోల్పోయినా న్యాయం జరగలేదని చెబుతూ ఈ ఉపఎన్నికను తమ వేదనను వెలిబుచ్చే వేదికగా మలచుకున్నారు. ఈ క్రమంలో రిటర్నింగ్‌ ఆఫీసు వద్ద సందడి వాతావరణం నెలకొంది.

READ MORE: Man Rescues Snakes:వామ్మో.. 100పైగా పాములను సముద్రంలో వదిలిన యువకుడు..

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తెలిపారు. నిన్నటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్‌ తరఫున నవీన్‌ యాదవ్‌ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్‌ఎస్‌ నుంచి మాగంటి సునీత‌ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అదే పార్టీ నుంచి పి. విష్ణు వర్ధన్‌ రెడ్డి డమ్మీ నామినేషన్‌ వేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి తరఫున ఆయన భార్య నామినేషన్‌ దాఖలు చేశారు. దీపక్‌ రెడ్డి ఈరోజు మరో సెట్‌ నామినేషన్‌ వేయనున్నారు.

READ MORE: Warangal: వరంగల్‌లో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి ఘోర అవమానం..

Exit mobile version