NTV Telugu Site icon

2025 MG Comet EV: క్రేజీ ఫీచర్లతో చౌకైన ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 230KM రేంజ్

Mg

Mg

చౌక ధరలో క్రేజీ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ కారును కొనాలనుకుంటున్నారా? అయితే అదిరిపోయే ఈవీ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇటీవల JSW MG మోటార్ ఇండియా భారత మార్కెట్లో తన చౌకైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EV ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కిలోమీటరుకు రూ. 2.5 చొప్పున బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BAAS) ఎంపిక కూడా ఉంది.

Also Read:Akbaruddin Owaisi : అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ వ్యంగ్య కథ.. ప్రభుత్వాల హామీలపై వ్యంగ్యాస్త్రాలు

కొత్త MG కామెట్ బుకింగ్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కారు కొత్త బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. కామెట్ EV మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ ఫాస్ట్ ఛార్జ్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ ఛార్జ్ ఉన్నాయి.

Also Read:CM Revanth Reddy : కేబినెట్ విస్తరణ అజెండాతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్..?

ఎక్సైట్, ఎక్సైట్ ఫాస్ట్ ఛార్జ్ వేరియంట్లలో వెనుక పార్కింగ్ కెమెరా, పవర్-ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్లు ఉన్నాయి. ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ ఛార్జ్ వేరియంట్‌లలో ప్రీమియం లెథరెట్ సీట్లు 4-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్‌లో 17.4 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ (IDC) వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.

Also Read:Honor Pad X9a Tablet: గేమింగ్‌, మల్టీటాస్కింగ్‌ పనుల కోసం అదిరిపోయే ట్యాబ్లెట్‌ను విడుదల చేసిన హానర్

MG కామెట్ EV లో కంపెనీ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), వెనుక పార్కింగ్ సెన్సార్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్లను అందించారు. కారు క్యాబిన్‌లో లెథరెట్ సీట్లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి.