NTV Telugu Site icon

Devara-NTR: ‘దేవర’ భయాన్ని పోగొడతాడా?.. లేదా మరింత భయపెడతాడా?

Devara Ntr

Devara Ntr

ఇంకొన్ని గంటల్లో దేవర తుఫాన్ థియేటర్లను ముంచెత్తనుంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ ఏం చేస్తాడు? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్ కూడా దేవర రిజల్ట్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌తోనే మొదలైంది.. ఎన్టీఆర్‌తోనే ఎండ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళితో ఓ హీరో సినిమా చేసిన తర్వాత.. ఆ తర్వాతి సినిమా ఫ్లాప్ అవుతుంది. అది ఎన్టీఆర్‌తోనే మొదలవగా.. రాజమౌళి హీరోలకు బ్యాడ్ సెంటిమెంట్‌గా మారింది.

దర్శకుడిగా రాజమౌళి ప్రయాణం ఎన్టీఆర్‌తో మొదలైంది. స్టూడెంట్ నెం.1 సినిమా హిట్ అవగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ‘సుబ్బు’ ఫ్లాప్ అయింది. ‘సింహాద్రి’ తర్వాత వచ్చిన ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్ అయింది. ‘యమదొంగ’ తర్వాత చేసిన ‘కంత్రీ’ కూడా కొట్టుకుపోయింది. ఒక్క ఎన్టీఆర్ అనే కాదు.. ప్రభాస్‌తో సహా చాలామంది హీరోల పరిస్థితి ఇదే. దీంతో ఇప్పుడు ‘దేవర’ ఏం చేస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ కొరటాల లాస్ట్ ఫిల్మ్ ‘ఆచార్య’ ఫ్లాప్ అయింది. దీనికి తోడు రాజమౌళి సెంటిమెంట్ కూడా ఉంది. అయితే ఇప్పటివరకున్న ట్రెండ్ ప్రకారం దేవర సినిమా హిట్ అనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

Also Read: Prakash Raj: గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం! ప్రకాశ్‌ రాజ్ ట్వీట్ వైరల్

అలాగే దేవరకు రాజమౌళి సెంటిమెంట్‌తో పాటు ఒక హిట్ సెంటిమెంట్ కూడా ఉంది. ఇదే ఇప్పుడు దేవరను బ్యాలెన్స్ చేసేలా ఉంది. ఇప్పటివరకు మెగా హీరోలకు ఫ్లాప్‌ ఇచ్చిన డైరెక్టర్లు.. నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ‘అజ్ఞాతవాసి’ వంటి ఫ్లాప్‌ తర్వాత ‘అరవింద సమేత’తో త్రివిక్రమ్‌ శ్రీనివాస్ హిట్ కొట్టాడు. పవర్ స్టార్‌తో బాబీ తీసిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఫ్లాప్‌ కాగా.. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో తీసిన ‘జై లవకుశ’ హిట్ అయింది. ఇప్పుడు ‘ఆచార్య’ ఫ్లాప్‌ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. కాబట్టి ఖచ్చితంగా కొరటాల కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకంతో ఫాన్స్ ఉన్నారు. దేవరకు హిట్ సెంటిమెంట్ కలిసొచ్చేలానే ఉంది. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యేలానే ఉంది. దేవర ఇకపై రాజమౌళి హీరోల భయాన్ని పొగొడతాడా? లేదా మరింత భయపెడాతాడా? అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.