NTV Telugu Site icon

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం.. అసలేమైందంటే?

Devara

Devara

Jr NTR Team Clarity on Injury to His Hand: జూనియర్ ఎన్టీఆర్ కి గాయం అయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు దగ్గర చిన్న గాయమైందని ఈ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఆఫీసు నుండి వచ్చిన ప్రకటన మేరకు జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది అని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయన చేతికి ఒక కట్టు కట్టారు.

Read Also: Mumbai: ముంబైలో ఘోరం.. 3 ఏళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అఘాయిత్యం

ఇలా గాయపడినప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు కోలుకుంటున్నాడు అని పేర్కొన్నారు. కట్టిన కట్టును రెండు వారాల్లో తొలగిస్తారని త్వరలో తిరిగి బిజీ కానున్నారు అని పేర్కొన్నారు. ఈలోగా ఈ చిన్న గాయానికి సంబంధించి ఎక్కువ ఊహాగానాలు వైరల్ చేయవద్దని మేము అభ్యర్థిస్తున్నాము అని పేర్కొన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాలో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. దేవర సినిమా రెండు పార్టులుగా పాన్ ఇండియా లెవెల్ లోకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Read Also: Murder Case: ప్రియుడిని మర్డర్ చేయించిన ప్రియురాలు

Show comments