NTV Telugu Site icon

Kapil Show Season 2: బాలీవుడ్ షోకు తెలుగు స్టార్ హీరో.. భారత స్టార్ క్రికెటర్స్ కూడా!

Kapil Show Season 2

Kapil Show Season 2

Tollywood Hero Jr NTR will be in Kapil Show Season 2: ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎంతటి సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైన ఈ షోకు రికార్డు వ్యూస్ వచ్చాయి. అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, దిల్జిత్ దోసాంజ్, ఇంతియాజ్ అలీ, సన్నీ డియోల్, బాబీ డియోల్, మేరీ కోమ్, సైనా నెహ్వాల్, సానియా మీర్జా లాంటి వారు షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హోస్ట్ కపిల్ శర్మ తాజాగా సీజన్ 2ను ప్రకటించారు. సెప్టెంబరు 21న షో కొత్త ఎపిసోడ్‌ టెలికాస్ట్ అవుతుందని తెలిపారు. గత సీజన్ టాప్ స్టార్‌లతో 13 వారాల పాటు నాన్‌స్టాప్ కామెడీని అందించగా.. సీజన్ 2 మరింత నవ్వులు, వినోదాన్ని అందిస్తుందని చెప్పారు.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2లో తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేయనున్నారు. ఇందుకు సంబందించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌లోనే టైగర్ రానున్నారు. ఎందుకంటే సెప్టెంబరు 27న ‘దేవర’ రిలీజ్ ఉంది కాబట్టి. దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కపిల్ షో సీజన్ 2లో పాల్గొన్నారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అలియా భట్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా షోకు రానున్నారట.

Also Read: White Snake Viral Video: వైట్ స్నేక్‌ను ఎప్పుడైనా చూశారా?.. భలే ముద్దుగా ఉందే!

‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సీజన్ 2లో భారత స్టార్ క్రికెటర్స్ కూడా పాల్గొననున్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ షోలో కనిపించనున్నారు. ఈ క్రికెటర్లు అందరూ టీ20 ప్రపంచకప్ 2024 విశేషాలను పంచుకోనున్నారు. హాస్యనటుడు కపిల్ శర్మ తన కామెడీతో టీమిండియా క్రికెటర్లను ఎలా నవ్విస్తాడో చూడాలి.

Show comments