NTV Telugu Site icon

NTR: ‘లే బాబాయ్.. లే’ చలపతిరావు మృతిపై జూ.ఎన్టీఆర్ భావోద్వేగం

Ntr

Ntr

NTR: తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్ నటుడు చలపతిరావు తమ్మారెడ్డి(78) కన్నుమూశారు. హైదరాబాదులోని తన తమ్ముడి నివాసంలో తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మహానటుడు ఎన్టీఆర్‌ దగ్గర నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు మూడు తరాల హీరోలతో కలిసి వెండితెరపై ఒక వెలుగువెలిగారు చలపతిరావు. చిత్రసీమలో ఎంతోమంది ‘బాబాయ్’ అంటూ చలపతిరావు ను అభిమానంగా పిలుస్తూ ఉంటారు. ఇక నటరత్న ఎన్టీఆర్ తనయులు నిజంగానే ‘బాబాయ్’లా చూసుకుంటూ ఉంటారు. సీనినటుడు చలపతిరావు మృతిపట్ల జూ.ఎన్టీఆర్‌ భావోద్వేగానికి గురయ్యారు. యూఎస్‌ నుంచి జూ.ఎన్టీఆర్‌ వీడియో కాల్లో లే బాబాయ్‌.. లే అంటూ జూ. ఎన్టీఆర్‌ బాధను వ్యక్తపరిచారు. నందమూరి ఫ్యామిలీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్నారు. తాతగారి రోజుల నుంచి మాకు చలపతి బాబాయ్‌ ఎంతో ఆప్తుడని తెలిపారు.

Read Also: Vijay v/s Ajith: విజయ్, అజిత్ పాటల జోరు.. సోషల్ మీడియాలో అభిమానుల పోరు

సీనియర్‌ నటుడు చలపతి రావు మృతిపట్ల పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేశారని చెప్పారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చలపతిరావు అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో బుధవారం నిర్వహించనున్నారు. ఆయన కూతురు అమెరికాలో ఉంటుండంతో ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

Show comments