Site icon NTV Telugu

Saamrajyam: ఎన్టీఆర్ చేతుల మీదుగా శింబు ‘సామ్రాజ్యం’ ప్రోమో లాంచ్.. ‘నా పాత్రకు ఎన్టీఆర్ కరెక్ట్’ అంటూ..!

Saamrajyam

Saamrajyam

Saamrajyam: కోలీవుడ్ స్టార్ నటుడు శింబు, జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అరసన్‌’ (Arasan). ఈ సినిమాను తెలుగులో ‘సామ్రాజ్యం’ (Saamrajyam) పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Raja Saab: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. బర్త్‌డేకి ‘రాజాసాబ్’ ఎంట్రీ ఫిక్స్.?

ఉత్తర చెన్నై నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం.. చిత్రబృందం విడుదల చేసిన దాదాపు 4 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమో చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంది. హత్య కేసు అభియోగంతో కోర్టుకు వచ్చిన హీరో.. జడ్జి ముందు తనకు ఏమీ తెలియదని, తనను ఇరికించారని చెబుతూనే, మరోవైపు ముగ్గురిని నరికి చేతులు కడిగే సన్నివేశాలను ప్రోమోలో చూపించారు. అనిరుధ్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటోంది.

Bollywood: ఒకే ఫ్రేమ్‌లో యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్‌ బీస్ట్.. షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఖాన్.. కొత్త సినిమా రాబోతోందా..?

ఇక ప్రోమో మొదట్లో ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంట్రీ, హీరోతో ఆయన మాట్లాడే డైలాగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అయితే, ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది మాత్రం చివర్లో శింబు చెప్పిన డైలాగ్. మీడియా ప్రతినిధులతో మాట్లాడే క్రమంలో శింబు, “నా స్టోరీని ఎవరితో చేపిద్దామనుకుంటున్నారు.. ఎన్టీఆర్‌తో చేపించండి కుమ్మేస్తాడు” అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఇంట్రో ప్రోమోను తెగ షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలశ్యం ఈ సామ్రాజ్యం సినిమా ప్రోమోను ఇక్కడ చూసేయండి.

Exit mobile version