NTV Telugu Site icon

NTR Fan: ప్లీజ్ డాక్టర్స్.. ‘దేవర’ చూసేవరకైనా నన్ను బతికించండి: ఎన్టీఆర్‌ అభిమాని

Ntr Fan Devara

Ntr Fan Devara

NTR Fan Kaushik’s last wish was to see the Devara: ‘ప్లీజ్ సర్.. దేవర చిత్రం చూసేవరకైనా నన్ను బతికించండి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌ వీరాభిమాని ఒకరు డాక్టర్లను కోరుతున్నాడు. గత కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్‌ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్‌ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నాడు. దేవర చిత్రంను చూడడమే కౌశిక్‌ చివరి కోరిక. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్‌ ఫాన్స్, నెటిజెన్స్.. అతడి కోరిక నెరవేరావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

ఎన్టీఆర్‌ అంటే కౌశిక్‌కు చిన్నప్పటినుంచి పిచ్చి అని అతని తల్లిదండ్రులు తెలిపారు. ‘చిన్నప్పటినుంచి ఎన్టీఆర్‌ అంటే కౌశిక్‌కు చాలా ఇష్టం. నా కొడుకు బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నాడు. అయినా కూడా దేవర సినిమా చూడాలనుకుంటున్నాడు. సెప్టెంబర్‌ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. దేవర చూడడమే కౌశిక్‌ ఆఖరి కోరిక’ అని ఆయన తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!

తన కుమారుడి వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని కౌశిక్‌ తల్లి తెలిపారు. ప్రభుత్వం, దాతలు తమకు సాయం చేయాలని కోరారు. ఇందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఎన్టీఆర్‌ అభిమానులు షేర్ చేసి.. ఆయన్ని ట్యాగ్‌ చేస్తున్నారు. ఈ విషయం ఎన్టీఆర్‌ వరకు చేరితే.. తప్పకుండా సాయం చేస్తారని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవర సినిమా చూడడమే కాదు.. బోన్‌ క్యాన్సర్‌ను కూడా కౌశిక్‌ జయించాలని అందరం కోరుకుందాం. కొరటాల శివ, ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న దేవర సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Show comments