NTV Telugu Site icon

JP Nadda : కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం

Jp Nadda

Jp Nadda

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 2 దఫాలుగా పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్‌ ఇటీవల యాదాద్రి నుంచి మూడో దశ పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. నేడు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మూడో దశ పాదయాత్ర ముగించనున్నారు. అయితే.. మూడో దశ ప్రజసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు.

 

అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓరుగల్లు గడ్డకు నా నమస్కారం అంటూ ఆయన తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజాసంగ్రామ యాత్ర మూడవ దశ ముగిసిందని, ఈ సభకు రావడం ఎంతో సంతోషంగా వుందన్నారు జేపీ నడ్డా. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర సంకల్పమని, సభ జరగకుండా ప్రభుత్వం ఎన్నో కుట్రలు పన్నిందని, కేసీఆర్ కుటుంబపాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.