ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు. కొన్ని సార్లు ఓటమిలో కూడా గెలుపు ఉంటుందని, తెలంగాణలో ఆ మేరకు విజయం సాధించామని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ లో బీజేపీకి ఒక శాసనసభ్యుడే ఉన్నాడు.. బీజేపీ ఓటు శాతం అప్పుడు 7.1 శాతం కాగా, ఇప్పుడది రెట్టింపై 14 శాతానికి పెరిగి 8 మంది శాసనసభ్యులు గెలుపొందారన్నారు జేపీ నడ్డా. తెలంగాణలో ఈ సారి వదలిపెట్టేది లేదని, తెలంగాణలో కూడా ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు జేపీ నడ్డా. అందుకు సన్నద్దమవుతున్నామని, మోడీ నాయకత్వానికి ప్రజలు మద్దతివ్వడం వల్లనే అన్ని రాష్ట్రాల్లో ఇంతటి గొప్ప ఫలితాలు రావడానికి కారణమన్నారు జేపీ నడ్డా.
Vijayasai Reddy : విజయసాయి రెడ్డికి “సంసద్ మహారత్న” అవార్డు
అలాగే, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలంతా ఎంతో శ్రమించి బిజేపి కి ఓట్లు వచ్చేలా కృషి చేశారని, శ్రమించి పనిచేసిన కార్యకర్తలందరికీ శుభాభినందనలు తెలిపారు జేపీ నడ్డా. 2014లో కేవలం 5 రాష్ట్రాల్లో ఉన్న ఎన్.డి.ఏ … ఇప్పుడు 17 రాష్ట్రాల్లో పరిపాలన చేస్తోందని, మూడోసారి మోడి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారేదని, ఆ సంప్రదాయాన్ని కాదని… ఉత్తరాఖండ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నామన్నారు. మన దేశ రాజకీయ స్థితిగతులను ప్రధాని మోదీ మార్చివేశారన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీ గరీబ్, యువ, రైతు, మహిళా శక్తిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతోందన్నారు. దేశాన్ని ముందంజలో ఉంచడంలో వీరి పాత్ర ఉంటుందన్నారు. దేశంలో ముప్పై ఏళ్ల తర్వాత బీజేపీ మాత్రమే సంపూర్ణ మెజార్టీతో 2014లో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
