NTV Telugu Site icon

J.P.Nadda: విపక్షాల కూటమి ‘INDIA’ పై జేపీ నడ్డా ఫైర్

Jp Nadda

Jp Nadda

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విపక్షాల కూటమి ‘INDIA’ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు పేరు మార్చుకోవడం వల్ల అవగాహన మారదని అన్నారు. అంతేకాకుండా ‘INDIA’ను పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థితో పోల్చాడు. మంగళవారం ఆయన చేసిన ట్వీట్‌లో “పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థిని అతని స్నేహితులు అసహ్యించుకుంటారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం పేరును మార్చాలని భావిస్తుంటారు. ఇది కూడా అలాంటిదే అని ఆయన పేర్కొన్నారు.

Anudeep : తన తరువాత సినిమాను ఆ స్టార్ హీరో తో చేయబోతున్నాడా..?

ప్రతిపక్ష పార్టీలు పెట్టే ఇలాంటి పేర్లపై నష్టమేమి లేదని.. పేరు మార్చడం వల్ల ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం మారదని బీజేపీ అంటోంది. మరోవైపు ఈరోజు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ప్రధాని మోడీ ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. ఇండియన్ ముజాహిదీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్షాల కొత్త పేరుగా ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి దిక్కులేని ప్రతిపక్షాన్ని ఇప్పటి వరకు చూడలేదని ఆయన విమర్శించారు.

Urvashi Rautela: మిల మిల మెరిసే మగువా.. నువ్వు మేనక చెల్లెలివా

మరోవైపు బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.. ఇవి కూడా ఇండియానే. ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏమీ జరగదని ఆయన తెలిపారు. అటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా INDIAపై ఆరోపణలు చేశారు.