బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 31న రాష్ట్రానికి జేపీ నడ్డా రానున్నారు. ఈ సందర్భంగా ఆయన సంగారెడ్డిలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో బీజేపీ కార్యాలయంను ప్రారంభించనున్న జేపీ నడ్డా.. అదే రోజు మరో 6 జిల్లా కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో మరో రెండు జిల్లాల కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అనంతరం సంగారెడ్డిలో ఏర్పాటు చేయనున్న సభలో జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జేప నడ్డా పర్యటనకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు తెలంగాణ బీజేపీ నేతలు. ఈ నెల 31న మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు జేపే నడ్డా.. అక్కడి నుండి బయలుదేరి సంగారెడ్డి చేరుకుంటారు.
Also Read : Off The Record: శంకర్ నాయక్.. స్టయిలే వేరు!
సంగారెడ్డిలో బిజెపి జిల్లా కార్యాలయం ప్రారంభింస్తారు.అక్కడి నుండే వర్చువల్ గా భూపాలపల్లి, వరంగల్,జనగామ,మహబూబాబాద్ తోపాటు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల కార్యాలయాలను ప్రారంభిస్తారు. భూపాలపల్లి లో శ్రీమతి డికె అరుణ,వరంగల్ లో శ్రీ ఈటల రాజేందర్,జనగామ లో శ్రీ కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, డా. బూర నర్సయ్య గౌడ్, మహబూబాబాద్ లో శ్రీ గరికపాటి మోహన్ రావు, శ్రీ రవీంద్ర నాయక్ లు ముఖ్య అతిధులుగా పాల్గొంటారు. సంగారెడ్డిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం శంషాబాద్ లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు.
Also Read : Koppu Basha : దుర్గం చిన్నయ్య వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి
