Jowar Uttapam Recipe: షుగర్ పేషెంట్లకు అమృతం.. బరువు తగ్గాలనుకునే వారికి వరం.! ‘జొన్న పిండి ఊతప్పం’ ట్రై చేసేయండి ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Uttapam Recipe: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే అల్పాహారం దొరకడం కష్టమైపోతోంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహంతో బాధపడేవారు బియ్యం పిండికి ప్రత్యామ్నాయం కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం మిల్లెట్ పవర్ తో నిండిన “జొన్న పిండి ఊతప్పం” ఒక అద్భుతమైన ఎంపిక. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చేసేద్దాం పదండి.
సాధారణంగా బియ్యం పిండితో చేసే ఉత్తపాల కంటే జొన్నలతో చేసేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమమైన ఆహారం.
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Raghav Chadha: ఉద్యోగం లేదా బిడ్డ..? పరిస్థితి తండ్రికి రాకూడదు.. ఆ సెలవులను చట్టబద్ధం చేయండి..!
కావలసిన పదార్థాలు:
* జొన్న పిండి: 1 కప్పు
* బొంబాయి రవ్వ (సుజీ): ½ కప్పు
* పెరుగు: ½ కప్పు
* నీళ్లు: అవసరమైనంత (సుమారు 1 ¼ కప్పు)
* కూరగాయలు: ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తరుగు, టమాటో ముక్కలు.
* మసాలాలు: సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర,
* జీలకర్ర (½ స్పూన్),
* వాము (చిటికెడు).
* రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా, నూనె.
తయారీ విధానం:
* ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు జొన్న పిండి, అర కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పెరుగు, ఒక కప్పు నీళ్లు పోయాలి. ఆ తవాత దీనిని విస్కర్ లేదా గరిటెతో ఎక్కడా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి.
* కలుపుకున్న మిశ్రమంపై మూత పెట్టి కనీసం 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల రవ్వ నీటిని పీల్చుకుని పిండి సాఫ్ట్‌గా తయారవుతుంది.
* 30 నిమిషాల తర్వాత పిండి కొంచెం గట్టిపడుతుంది. అప్పుడు మరో పావు కప్పు నీళ్లు పోసి దోస పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తరుగు, టమాటో, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. అలాగే జీలకర్ర, వాము, ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి బాగా కలపాలి.
Amit Shah: “నక్సలిజం”చరిత్రను తవ్వి బయటపెట్టిన అమిత్ షా.. ఆ 90 నిమిషాలు దద్దరిల్లిన పార్లమెంట్!
* ఇప్పుడు స్టవ్ మీద పెన్నం వేడి చేసి, కొంచెం నూనె రాసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇప్పుడు పిండిని తీసుకుని మరీ పల్చగా కాకుండా, కొంచెం మందంగా (ఊతప్పంలా) వేసుకోవాలి.
* జొన్న పిండి ఉడకడానికి సాధారణ దోస కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి నిదానంగా రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
* అంతే ఎంతో రుచిగా ఉండే జొన్న పిండి ఊతప్పం రెడీ.. దీనిని అల్లం చట్నీ లేదా పల్లీల చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. తక్కువ నూనెతో, ఎక్కువ పోషకాలతో నిండిన ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!