Site icon NTV Telugu

Josh Butler: పేరు మార్చుకున్న స్టార్ క్రికెటర్.. ఇక నుంచి ఏమని పిలువాలంటే..!

Josh Butler

Josh Butler

ఇంగ్లండ్ వైట్ బాల్, ప్రస్తుత ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ తన పేరును మార్చుకున్నాడు. ‘వాస్తవంగా నా పేరు జోస్ (JOS) బట్లర్. అయితే అందరూ జోష్ (JOSH) బట్లర్ అనే పిలుస్తున్నారు. ఆఖరికి మా అమ్మ కూడా ఇలానే పిలుస్తుంది. దీంతో.. 13 ఏళ్ల కెరీర్, 2 వరల్డ్ కప్ విజయాల తర్వాత ఇప్పుడు అధికారికంగా నా పేరును జోష్ బట్లర్ గా మార్చుకుంటున్నా’ అని పేర్కొన్నారు. అందుకు సంబంధించి వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ Xలో షేర్ చేసింది. ఆ వీడియోలో ‘నా జీవితమంతా నన్ను తప్పుడు పేర్లతో పిలుస్తున్నారని, తప్పుడు పేర్లతో పిలిచే వారిలో నా తల్లి కూడా ఉంది’. అని జోష్ బట్లర్ అన్నాడు.

Read Also: Afghanistan: ఘోరం.. మందుపాతర పేలి 9 మంది చిన్నారుల మృతి

పేరు మార్చుకున్న తర్వాత మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే.. జోష్ రెండుసార్లు ప్రపంచ కప్ ఛాంపియన్, ఐపీఎల్ 2022లో అత్యధిక పరుగులు చేసినందుకు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. 33 ఏళ్ల జోష్ బట్లర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 57 టెస్టులు, 181 వన్డేలు, 114 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 2907, వన్డేల్లో 5022, టీ20లో 2927 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో.. బట్లర్ ఇప్పటివరకు 98 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 147 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 3245 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 5 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు సాధించాడు.


Read Also: Niharika: రాహుల్ ఇంటి ముందు అమ్మాయిలు క్యూ.. ఆ విషయం బయటపెట్టిన నిహారిక

Exit mobile version