NTV Telugu Site icon

Jon Landau Death: హాలీవుడ్‌లో విషాదం.. టైటానిక్‌, అవతార్‌ చిత్రాల నిర్మాత కన్నుమూత!

Jon Landau Dies

Jon Landau Dies

Avatar Movie Producer Jon Landau Dies: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. యూనివ‌ర్స‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ చిత్రాలైన టైటానిక్‌, అవతార్‌ల నిర్మాత జోన్‌ లండౌ కన్నుమూశారు. ఆయన వయసు 63. గ‌త కొంత‌కాలంగా క్యాన్సర్‌తో బాధప‌డుతున్న ఆయ‌న లాస్ ఏంజిల్స్‌లో జూలై 5న మృతి చెందారు. జోన్‌ లండౌ క్యాన్సర్‌తో 16 నెలల ఓటు పోరాటం చేశారు. జోన్‌ లండౌ శుక్రవారం తుదిశ్వాస విడవగా.. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.

ఆస్కార్ విన్నింగ్ చిత్రం టైటానిక్‌, సంచలనాత్మక సినిమా ‘అవతార్‌’లను జోన్‌ లండౌ నిర్మించారు. డైరెక్టర్‌ జేమ్స్ కామెరూన్‌తో క‌లిసి ప్ర‌స్తుతం అవ‌తార్ సినిమాల‌ ఫ్రాంఛైజీ చిత్రాల‌ను ఆయన నిర్మిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు జోన్‌ లండౌ తన కెరీర్‌లో అవ‌తార్ 4 చిత్రాల‌తో క‌లిపి.. మొత్తంగా 8 సినిమాల‌ను నిర్మించారు. రెండు సినిమాల‌కు ఆయన స‌హాయ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. కామెరూన్‌తో లాండౌ సంయుక్తంగా నిర్మించిన చిత్రాలు మూడు ఆస్కార్ నామినేషన్‌లకు ఎంపికయ్యాయి.

Also Read: IND vs PAK: పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమి.. సురేష్ రైనా చెలరేగినా..!

జోన్‌ లండౌ 1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా సినీ కెరియర్‌ను ప్రారంభించారు. డైరెక్టర్‌ జేమ్స్ కామెరూన్‌తో కలిసి టైటానిక్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రికార్డులను తిరగరాయడమే కాకుండా.. ఎనలేని గుర్తింపును తీసుకు వ‌చ్చింది. ఈ సినిమాకు 14 ఆస్కార్స్ నామినేష‌న్స్ రాగా.. 11 అవార్డులు గెలుచుకుని హాలీవుడ్ సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది. లాండౌ నిర్మాతగా 2009లో విడుదలైన అవతార్‌ సినిమా సుమారు రూ.24 వేల కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతార్‌ కొనసాగుతోంది. అవతార్‌ 2 రూ. 19 వేల కోట్లు రాబట్టింది. లాండౌ చివ‌ర‌గా నిర్మించిన అవ‌తార్ సిరీస్‌లో 3వ భాగం 2026లో, 4వ భాగం 2030లో రిలీజ్ కానుంది.

Show comments