NTV Telugu Site icon

Pemmasani Chandrashekar: ప్రజలకు అండగా సూపర్‌ సిక్స్.. మేలు చేసే బాధ్యత మాదే..

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ ద్వారా ప్రజలకు మేలు చేసే బాధ్యత మాదేనని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్‌లో సుమారు 200 మంది వైసీపీ నాయకులు శనివారం టీడీపీలో చేరారు. పెమ్మసాని, నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరగగా.. టీడీపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల నుంచి పార్టీలోకి వస్తున్నట్లు కార్యకర్తలు తెలిపారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ.. డివిజన్‌లో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, తాగునీటి సమస్యతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు మేలు చేయడమే కాకుండా.. రోడ్లు తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటామని ఆయన తెలిపారు. నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉండగా.. ముస్లిం మహిళలు ధైర్యంగా ఉండేవారని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు శిక్షణా కేంద్రాలు తదితర కార్యక్రమాలతో చంద్రబాబు ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నంబూరు సుభాని, గుంటూరు నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: Tirumala: నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒకేరోజు వందల మంది కార్యకర్తలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. నియోజకవర్గంలోని 5, 12, 14, 15వ డివిజన్లలో 500 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం నాడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభాని, పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులతో కలిసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా టీడీపీలోకి చేరికలు జరిగాయి. కాగా 12వ డివిజన్ నుంచి 50 మంది, 14వ డివిజన్ నుంచి 150 మంది, 15వ డివిజన్ నుంచి 200, ఐదో డివిజన్ నుంచి మరో వందమంది నాయకులకు టీడీపీ కండువా కప్పి పెమ్మసాని, నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్, టీడీపీ నాయకులు భరత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. స్థానికంగా కొందరు నాయకులే గంజాయి అమ్ముతున్నా ప్రశ్నించలేని దుస్థితిలో ప్రజలు ఊరకుండి పోతున్నారన్నారు. నియోజకవర్గంలోని డివిజన్లలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రజల అవస్థలు పడుతున్నా ఈ ఎమ్మెల్యేకి ఏమీ పట్టడం లేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అలాగే ఇళ్ల పట్టాలు లేని అర్హులకు పట్టాలు అందించడం లేదా టిడ్కో నివాసాలు కల్పించడం వంటి పరిష్కారాలు చూపిస్తామని భరోసా ఇచ్చారు. ఈ చేరికల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షేక్ (నంబూరు) సుభాని, భరత్ రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, సీహెచ్ చిట్టిబాబు, తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.