NTV Telugu Site icon

John Cena: ఆ హీరో మాటలు నా జీవితాన్ని మార్చాయి: జాన్‌ సీనా

John Cena

John Cena

John Cena Enjoyed Indian Food at Ambani Wedding: డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, హాలీవుడ్‌ నటుడు జాన్‌ సీనా ఇటీవల భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. జులైలో జరిగిన అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి అతడు హాజరయ్యాడు. భారతీయ వస్త్రధారణలో జాన్‌ సీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంబానీ పెళ్లి సందర్భంగా పలువురు బాలీవుడ్‌ స్టార్లతో సహా చాలా మంది ప్రముఖులను కలిశాడు. బాలీవుడ్ కింగ్‌ ఖాన్‌ షారుక్ ఖాన్‌ను జాన్‌ సీనా కలిసి చాలా సమయం మాట్లాడాడు. తాజాగా షారుక్‌ తనలో ఎలా స్ఫూర్తి నింపారో వివరించాడు.

జాతీయ మీడియా ఏఎన్‌ఐతో జాన్‌ సీనా మాట్లాడుతూ.. షారుక్ ఖాన్‌ను కలిసిన తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తికి కరచాలనం చేయడం, వారు ఏం చేశారో వారికే ప్రత్యేకంగా చెప్పడం చాలా భావోద్వేగ క్షణం. టెడ్‌ టాక్‌లో షారుక్‌ మాట్లాడారు. నా జీవితంలో సరైన సమయంలో ఆ మాటలు విన్నాను. అవి నాకెంతో స్ఫూర్తిని ఇచ్చాయి. నా జీవితాన్ని చాలా మార్చాయి. అప్పటి నుంచి నా ముందున్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతున్నా. ఏ అవకాశాన్నీ చేజార్చుకోవడం లేదు’ అని జాన్‌ సీనా చెప్పాడు.

Also Read: Viral Video: వాషింగ్టన్ సుందర్‌ను కొట్టేందుకు పరుగెత్తుకొచ్చిన రోహిత్.. వీడియో వైరల్!

భారతీయ వంటకాలపై కూడా జాన్‌ సీనా స్పందించాడు. ‘అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో అన్ని రకాల వంటకాలను వడ్డించారు. భారత వంటకాలు అద్భుతంగా ఉన్నాయి. అయితే స్వల్ప కాలమే భారత్‌లో ఉన్నాను. మళ్లీ వెళ్లి మరిన్ని భారత వంటకాలను రుచి చూడాలనుంది. మసాలా, కారం చెమటలు పట్టించాయి. వాటిని ఆస్వాదించడంలో నా సామర్థ్యమెంటో మరోసారి భారత్‌కు వచ్చినప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటా. త్వరలో భారత్‌కు రావాలనుకుంటున్నా’ అని డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ తెలిపాడు.

 

Show comments