Gautam Gambhir: గంభీర్ పూర్తి పదవీకాలంలో ఉండటం కష్టమే.. భారత మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు!
- శ్రీలంక పర్యటనతో హెడ్ కోచ్గా బాధ్యతలు
- టీ20 సిరీస్ కైవసం
- నాకు ఎలాంటి ఈర్ష్య లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joginder Sharma on Gautam Gambhir: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనతో భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గంభీర్ మార్గనిర్ధేశంలో లంక పర్యటనలో టీ20 సిరీస్ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్పై కన్నేసింది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో మాట్లాడుతూ ప్రోత్సహిస్తున్న గంభీర్పై భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముక్కుసూటిగా మాట్లాడే గౌతీ పూర్తి పదవీకాలంలో కోచ్గా ఉండటం కష్టమే అని అభిప్రాయపడ్డాడు. అవతలి వ్యక్తిని పొగడ్తలతో బుట్టలో వేసేద్దామనే స్వభావి కాదన్నాడు.
శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్లో జోగిందర్ శర్మ మాట్లాడుతూ… ‘భారత జట్టును నడిపిస్తున్న గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవిలో ఎక్కువ కాలం ఉండే అవకాశం చాలా తక్కువ. ఇలా అంటున్నానని అతడిపై వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ఈర్ష్య లేదు. గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకొనే వ్యక్తి. ఒక్కోసారి జట్టులోని ఆటగాళ్ల అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. ఇక్కడ విరాట్ కోహ్లీ గురించి చెప్పడం లేదు. ఇతర ప్లేయర్స్ కూడా గంభీర్ నిర్ణయాలను ఇష్టపడకపోవచ్చు. గౌతీ ఏదైనా సరే నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. అవతలి వ్యక్తిని పొగడ్తలతో బుట్టలో వేసేద్దామనే స్వభావి కాదు. ఏ పనినైనా నిబద్ధతతో చేస్తాడు. నిజాయతీ కలిగిన వ్యక్తి. అందుకే గౌతీ పూర్తికాలం హెడ్ కోచ్ పదవిలో ఉండకపోవచ్చు’ అని అన్నాడు.
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Also Read: Ambati Rayudu: ఏదీ అవసరం లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థనను తిరస్కరించిన అంబటి రాయుడు!
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో చివరి ఓవర్ వేసి అందరి మదిలో నిలిచిపోయిన బౌలర్ జోగిందర్ శర్మ. టీ20 ప్రపంచకప్తో చాలా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత జట్టులో అవకాశాలు రాకపోవడంతో క్రమంగా ఆటకు దూరమయ్యాడు. జోగిందర్ భారత్ తరఫున 4 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ప్రస్తుతం హరియాణా పోలీస్ శాఖలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
తాజావార్తలు
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..