Jofra Archer: ‘నేను ముందే చెప్పా.. సూర్యవంశీని అవుట్ చేయడం ఎలానో నాకు తెలుసని’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడంపై ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ తన బౌలింగ్‌లో సిక్సర్ కొట్టడంపై ఆర్చర్ స్పందిస్తూ.. ఆ తర్వాత అతడి వికెట్ తీసి స్కోర్ సమం చేసినట్లు వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో వీరిద్దరూ రాజస్థాన్ రాయల్స్ జట్టులో సహచర ఆటగాళ్లు కావడం ఇక్కడ విశేషం.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సమయంలో ఒక మ్యాచ్ అనంతరం ఆర్చర్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడానికి ప్రత్యర్థి జట్ల బౌలర్లు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అన్నాడు. అయితే, నెట్స్‌లో అతడికి నిరంతరం బౌలింగ్ వేస్తున్న క్రమంలో వైభవ్ ఏ బంతికి అవుట్ అవుతాడనే రహస్యం తనకు బాగా తెలుసని ఆర్చర్ అప్పట్లోనే ధీమా వ్యక్తం చేశాడు. కాకపోతే, ఆ రోజు ఆ విషయం చెప్పినప్పటికీ.. అది ఏ రకమైన బంతి అనేది మాత్రం తను బయటపెట్టలేదు, సస్పెన్స్‌గా ఉంచాడు.
Also Read
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన తర్వాత ఆర్చర్ మళ్లీ పాత విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. “నేను ముందే చెప్పాను.. వైభవ్‌ను ఎలా అవుట్ చేయాలో నాకు తెలుసని, ఇప్పుడు అదే చేసి చూపించాను” అని ఆర్చర్ పేర్కొనడం గమనార్హం.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!