Site icon NTV Telugu

Stunning Catch: కోహ్లీ లాగే.. జోరూట్ స్టన్నింగ్ క్యాచ్

Joe Root

Joe Root

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోగా.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయకుండ ఇంగ్లండ్ చూస్తుంది. అందుకోసం ఇంగ్లండ్ జట్టు.. ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. మరోవైపు యాషెస్ సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్ ను కేవలం డ్రా చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతుంది. అటు ఇంగ్లండ్ వికెట్ల కోసం పోరాడుతుంది.

Opposition Meet: ఆగస్ట్ 15 తర్వాతే ముంబయిలో ప్రతిపక్ష కూటమి మూడో సమావేశం!

రెండో రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో గంటన్నర పాటు వికెట్ కూడా పడలేదు. మార్నస్ లబుషెన్‌ను ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే చాలా సేపటి తర్వాత ఇంగ్లండ్ జట్టుకు ఓ అవకాశం వచ్చింది. మార్క్ వుడ్ వేసిన బంతిని లాబుషేన్ డిఫెండ్ చేశాడు. అది బ్యాట్ ఎడ్జ్ కు తగలడంతో స్లిప్ లో ఉన్న వ్యక్తి క్యాచ్‌ను అందుకున్నాడు. వికెట్ కీపర్ ఆ క్యాచ్ ను మిస్ చేయగా.. స్లిప్ లో ఉన్న జో రూట్ అప్రమత్తంగా ఉండటంతో తన ఎడమ చేతితో బంతిని పట్టుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టుకు ఒక పెద్ద రిలీఫ్ దొరికినట్లైంది. 82 బంతులు ఆడి 9 పరుగులు చేసిన లబుషేన్.. పెవిలియన్ బాట పట్టాడు.

CMD Raghuma Reddy : సంస్థ పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

మరోవైపు జో రూట్ పట్టిన.. ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ కు ముందు.. విరాట్ కోహ్లీ కూడా అలాంటి క్యాచ్‌నే పట్టుకున్నాడు. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రొమారియో షెపర్డ్ క్యాచ్‌ను కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు.

 

Exit mobile version