Israel-Iran Tension: ఇజ్రాయెల్ పై శనివారం నాడు అర్థరాత్రి డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్ దాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని ప్రధాని నెతన్యాహుకు తెలిపాను అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో శత్రువులు తనను ఏమీ చేయలేరన్నారు. మేం ఇజ్రాయెల్‌కు ఉక్కుకవచంలా ఉండటానికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసేందుకు హెల్ప్ చేశాం.. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు అని జో బైడెన్ పేర్కొన్నారు.
Read Also: Salaar: మీ ఇంటికే వచ్చేస్తున్న సలార్.. ఎక్కడ చూడొచ్చంటే?
అయితే, భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఈ దాడులను నేను ఖండిస్తున్నాను.. అంతకు ముందే.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో టెలిఫోన్‌లో మాట్లాడారు. దీంతో పాటు జీ7 దేశాధినేతలతో కూడా జో బైడెన్ ఈ ఘటనపై చర్చించారు. ఇరాన్ దాడిపై సమన్వయంతో దౌత్యమార్గంలో స్పందించే అంశంపై సంభాషించారు. ఇజ్రాయెల్ నేతలతో తన బృందం సభ్యులు టచ్‌లో ఉందని యూఎస్ అధ్యక్షుడు చెప్పారు. అయితే, ఇరాన్ దాదాపు 200 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ తెలిపింది. వాటిలో కొన్ని మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని చెప్పుకొచ్చింది. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐడీఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతినట్లు పేర్కొన్నారు. ఇరాన్ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి అని నెతన్యూహూ ప్రకటించారు.
Read Also: Ram Lalla Silver Coin: రామ్‌లల్లా వెండి నాణెం విడుదల.. ధర ఎంతో తెలుసా..?
ఇక, ఇరాన్ దాడిపై ఐరాసలో ఆ దేశ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇర్వానీ మాట్లాడుతూ.. అవసరమైన ప్రతిసారి మాకు ఉన్న ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటాం అని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదైనా సైనిక దుస్సాహసానికి పాల్పడితే ఈ సారి స్పందన మరింత బలంగా ఉంటుంది అని అతడు హెచ్చరించారు.
