NTV Telugu Site icon

SBI Recruitment 2024: ఎస్‌బీఐలో ఉద్యోగాలు..భారీగా జీతం..హైదరాబాద్ లో కూడా అవకాశం

Sbi

Sbi

చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం (ప్రభుత్వ ఉద్యోగం) పొందాలని కలలు కంటారు. మీ కల నెరవేర్చుకునే రోజు ఆసన్నమైంది. ఎస్బీఐ తీపి కబురు చెప్పింది. ఎస్‌బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inని సందర్శించాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను ఫిల్ చేయనుంది. ఎస్బీఐ ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ సర్వీసెస్ 2 (MMGS 2)లోని ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు కోల్‌కతా, హైదరాబాద్‌‌లో పనిచేయాల్సి ఉంటుంది. బ్యాంకు మొత్తం 150 మంది ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్లను రిక్రూట్ చేసుకోనుంది. జనరల్ కేటగిరీకి 61, ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, ఓబీసీలకు 38, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 15 ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కాలేజీలలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(IIBF) నుంచి ‘ఫారెక్స్’లో పొందిన సర్టిఫికెట్‌ ఉండాలి. డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్, ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌లో సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

READ MORE: TG: సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, స్టాఫ్ న‌ర్సుల భ‌ర్తీకి రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ రెండు దశల్లో ఉంటుంది. ఎస్బీఐ నియామక కమిటీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్‌లను స్వీకరిస్తుంది. కొన్ని ప్రమాణాలను ఆధారంగా చేసుకుని వీరి నుంచి కొందరిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తుంది. ఇంటర్వ్యూలలో మెరిట్ సాధించిన వారిని పోస్టుకు ఎంపిక చేస్తుంది. ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్క్స్ వస్తే సీనియారిటీ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను స్వీకరిస్తోంది. జూన్ 27 లోగా అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.750 గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు పే స్కేల్ ఉంటుంది. క్వాలిఫికేషన్, అనుభవం ఆధారంగా శాలరీని నిర్ణయిస్తుంది. శాలరీతో పాటు డియర్‌నెస్ అలవెన్స్(DA), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(CCA), హౌజ్ రెంట్ అలవెన్స్(HRA), ప్రావిడెంట్ ఫండ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, తదితర బెనిఫిట్స్ ఉంటాయి. 6 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.

Show comments