Site icon NTV Telugu

NIMS : నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ వైద్యుల భర్తీ నోటిఫికేషన్

Nims

Nims

సీనియర్ రెసిడెంట్ వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు నిమ్స్ అధికారులు విడుదల చేశారు. ఈనెల 7 లోపు అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని నిమ్స్ అధికారులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ELCU పైలెట్ ప్రాజెక్టు కింద ఈ నియామక ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని నిమ్స్ అధికారులు తెలిపారు. అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్ లో ఎండి చేసిన అభ్యర్థులుకు సీనియర్ పోస్టులకు అర్హులవుతారని నిమ్స్ అధికారులు పేర్కొన్నారు.
Also Read : Harish Rao : స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించిన హరీష్‌రావు

ఇదిలా ఉంటే.. న్యూ ఇయర్‌ వేళ మరో మూడు నోటిఫికేషన్ లు విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. పురపాలక శాఖలో 78 అకౌంట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. జనవరి 20 నుండి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది టీఎస్పీఎస్సీ. అయితే.. దీంతో పాటు.. కళాశాల విద్యాశాఖలో 544 పోస్ట్ లు(491 డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లు) భర్తీకి మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది TSPSC. అయితే.. జనవరి 31 నుండి ఫిబ్రవరి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇవే కాకుండా.. ఇంటర్మీడియట్ విద్యలో 40, సాంకేతిక విద్యలో 31 లైబ్రేరియన్ పోస్ట్ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.
Also Read : Boost Immunity With Mint : పుదీనాతో రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం

వీటికోసం జనవరి 21 నుండి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌లకు సంబంధించిన పరీక్షలు మే, జూన్‌ నెలల్లో ఉంటాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇదిలా ఉంటే నిన్న సైతం టీఎస్పీఎస్సీ గ్రూపు-3 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-3కి సంబంధించిన 1,365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీవరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Exit mobile version