ఏపీలోని నిరుద్యోగులకు హై కోర్టు శుభవార్త చెప్పింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రాసెస్ సర్వర్ 439 ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ హైకోర్టు. అయితే.. ఈ పోస్టులకు విద్యార్హత పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఆసక్తిగల అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుందని నోటిఫకేషన్‌లో హైకోర్టు పేర్కొంది. అయితే.. ఈ అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అక్టోబర్ 29వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read :Indonesia: ఇండోనేషియాలో ఘోరం.. పడవ ప్రమాదంలో 14మంది మృతి
ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకునేందుకు వీలుకల్పించారు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.400లు రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించారు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 80 మార్కుల చొప్పున గంటన్నర వ్యవధిలో రాయవల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. మెరిట్ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు.