NTV Telugu Site icon

Job Seeker: ఉద్యోగం కోసం కంపెనీ యాజమాన్యానికే ఆఫర్ ఇచ్చిన నిరుద్యోగి.. పోస్ట్ వైరల్..

Job Seeker

Job Seeker

గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం యువత ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదృష్టం కొద్దీ ఉద్యోగం క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయితే సరిపోతుంది కానీ., ఒక్కసారి మీ విద్యను పూర్తి చేసుకొని బయటికి వస్తే మాత్రం పరిస్థితి అంత సులువుగా లేదు. ఒక్క పోస్టుకు వేలమంది అప్లై చేసే అంతగా పరిస్థితి నెలకొంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, వారు తమ రెజ్యూమ్‌ లో నైపుణ్యాలు, అర్హతల గురించి వివరిస్తాము. అయితే, ఆ నిరుద్యోగి వింగ్‌ ఫై వ్యవస్థాపకుడు పరాస్ చోప్రాను విభిన్నంగా వ్రాసిన ఓ మ్యాటర్ ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

Also Read: Wound Healing: ఔషధ మొక్కను ఉపయోగించుకొని స్వీయ చికిత్స చేసుకున్న కోతి..

అతను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, అతను కంపెనీ వ్యవస్థాపకుడికి ఒక ఆఫర్ ఇచ్చాడు. దీనిపై పరాస్ చోప్రా ట్వీట్ చేశారు. ఒక యువకుడు తాను వింగిఫైలో పని చేయాలనుకుంటున్నట్లు రాశాడు. ఈ సంస్థ కోసం ఓ ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్లు ఆ యువకుడు తెలిపాడు.

Also Read: Burning alive: బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పు పెట్టి సజీవ దహనం..

అతడిని కంపెనీకి నియమించుకోవడానికి తాను కంపెనీకి 500 డాలర్స్ చెల్లిస్తానని చెప్పాడు. పని ప్రారంభించిన వారం రోజుల్లోగా తనను తాను నిరూపించుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగించండి అంటూ మెసేజ్ లో పేర్కొన్నాడు. తనను ఉద్యోగం నుంచి తొలగిస్తే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా అందులో పేర్కొన్నాడు.