NTV Telugu Site icon

PM Modi: నేడు దేశవ్యాప్తంగా ఉపాధి మేళా.. 70 వేల మందికి అపాయింట్ మెంట్ లెటర్స్

Narendra Modi

Narendra Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం (జూలై 22) దాదాపు 70,000 మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) శుక్రవారం (జూలై 21) ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా నేడు 44 చోట్ల ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపికైన ఈ యువకులను వివిధ ఉద్యోగాల్లో నియమిస్తామని పీఎంవో తెలిపింది.

Read Also:Hair Growth Tips: జామ ఆకులతో ఒక్కసారి ఇలా చేస్తే చాలు..జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

కొత్తగా నియమితులైన వారికి ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. PMO ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ యువకులు రెవెన్యూ శాఖ, ఆర్థిక సేవల విభాగం, పోస్ట్‌ల శాఖ, పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జలవనరుల శాఖ, సిబ్బంది, గృహ వ్యవహారాల శాఖలతో సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ప్రభుత్వంలో చేరనున్నారు.

Read Also:Sonali Bendre: బంగారు కళ్ల బుచ్చెమ్మ.. ఎప్పటికీ నువ్వు అందగత్తెవేనమ్మా

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాన మంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా ఈ ఉపాధి మేళా ఒక ప్రయత్నం అని ఆ ప్రకటన పేర్కొంది. ఇది మరింత ఉపాధిని సృష్టిస్తుందని, యువత సాధికారత కోసం అర్ధవంతమైన అవకాశాలను అందించాలని.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం ప్రేరేపించే పాత్రను పోషిస్తుందని భావిస్తున్నారు. ఉపాధి మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన వ్యక్తులు ‘కర్మయోగి ప్రారంభం’ ద్వారా శిక్షణ పొందే అవకాశాన్ని కూడా పొందుతారు. కర్మయోగి ప్రారంభం అనేది వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన వ్యక్తులందరికీ ఆన్‌లైన్ కోర్సు.