Unforgettable rejection: జాబ్ కోసం దరఖాస్తు చేసుకుంది.. ఊహించని గిఫ్ట్ అందుకుంది..! కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unforgettable rejection: ఏదైనా జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్నారంటే.. ఏమవుతుందో అనే టెన్షన్ ఆ అభ్యర్థిలో ఉంటుంది. ఆ సంస్థ ఎలా స్పందిస్తుంది? ఉద్యోగం ఇస్తుందా? తిరస్కరిస్తుందా? అనే ఉత్కంఠ ఉంటుంది.. అయితే, సిలికాన్ వ్యాలీలోని ఓ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ మహిళలకు సదరు సంస్థ ఊహించని గిఫ్ట్ పంపి ఆశ్చర్యపరిచింది.. ఊహించని గిఫ్ట్ ఏంటి? ఉద్యోగ సమాచారం కదా? ఇవ్వాల్సింది అనే ప్రశ్న తలెత్తవచ్చు.. విషయం ఏటంటే.. ఉద్యోగం ఇవ్వకుండా ఓదార్పుగా ఆ బహుమతి పంపింది.. మీకు ఈ ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామనే సందేశాన్ని ఇస్తూనే.. ఓ గిఫ్ట్ పంపడంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిలికాన్ వ్యాలీలోని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ‘సీక్రెట్ సుషీ’ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది ఓ మహిళ.. అయితే సర్వసాధారణంగా ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్న సమయంలో.. ఆ ఉద్యోగం ఇవ్వని పక్షంలో.. సారీ మిమ్మల్ని సెలక్ట్ చేయడం లేదని మెయిల్ పెడుతుంటారు.. ఇంకా కొన్ని కంపెనీలు అయితే.. ఎలాంటి సమాచారం కూడా ఇవ్వవు.. కానీ, సీక్రెట్ సుషీ మాత్రం.. మేనేజర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థికి తిరస్కరణ లేఖతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డును పంపించి ఆశ్చర్య పరిచింది.. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న సదరు అభ్యర్థికి సీక్రెట్ సుషీ నుండి దరఖాస్తు చేసినందుకు ధన్యవాదాలు అని చెబుతూ.. మిమ్మల్ని సెలక్ట్ చేయడంలేదని స్పష్టం చేసింది.. దాంతో పాటు గిఫ్ట్ వోచర్‌ను కూడా పంపించింది. ఇందుకు సంబంధించి ఆమె మెయిల్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేవారు.. తనకు వచ్చిన 7 డాలర్ల గిఫ్ట్ వోచర్‌ను కూడా పొందుపరిచి, మరిచిపోలేని అత్యుత్తమ తిరస్కరణ అంటూ కామెంట్ పెట్టారు.. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
Also Read
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
- భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
ఇక, జాబ్ రిజెక్షన్ లెటర్లో అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ని చేర్చినందుకు సిలికాన్ వ్యాలీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రశంసలు అందుకుంటుంది.. ఉద్యోగం రాకపోవడంతో నిరాశకు గురైనప్పటికీ, దరఖాస్తుదారురాలు ఈ ఊహించని గిఫ్ట్‌తో ఓదార్పుని పొందారు. Reddit పోస్ట్‌లో దీనిని “బెస్ట్ రిజెక్షన్” అని పేర్కొన్నారు. “సీక్రెట్ సుషీలో ఖాతా మేనేజర్/ప్రాజెక్ట్ మేనేజర్” హోదాలో ఆమె ఆసక్తికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు ఆమె అర్హతలు మరియు అనుభవంతో కంపెనీ నిజంగా ఆకట్టుకుందని పేర్కొంటూ ఈమెయిల్ ప్రారంభమైంది. ఈ ఇమెయిల్ దరఖాస్తుదారుకు భరోసా ఇచ్చింది. భవిష్యత్ స్థానాల కోసం ఆమె సమాచారాన్ని కలిగి ఉంటారని పేర్కొంటూ.. “మీరు ఒకరినొకరు తెలుసుకోవడంలో పెట్టుబడి పెట్టిన సమయాన్ని మరియు కృషిని మేం నిజంగా అభినందిస్తున్నాము మరియు భవిష్యత్తులో మీ మార్గాలు మళ్లీ దాటాలని ఆశిస్తున్నాము. .” అని పేర్కొంది.
తాజావార్తలు
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?