NTV Telugu Site icon

Jitendra Yunik EV Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. రయ్.. రయ్.. మంటూ 118 కి.మీ.ల మైలేజ్

Jitendra Yunik Ev Scooter

Jitendra Yunik Ev Scooter

Jitendra Yunik EV Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా టూ వీలర్ వినియోగదారులు ఇప్పుడు ఈవీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఓలా, ఏథర్ వంటి పెద్ద కంపెనీలు ఈ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాయి. ఇక స్టార్టప్ సంస్థలు కూడా ఈ సెక్టార్‌లో తమ మార్కు చూపించేందుకు సిద్దమవుతున్నాయి. అందులో భాగంగానే నాసిక్‌కు చెందిన జితేంద్ర ఈవీ అనే స్టార్టప్ సంస్థ, తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ “యూనిక్” మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. జితేంద్ర యూనిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఒకప్పటి ఫేమస్ మోడల్ పియాజియో వెస్పాను గుర్తు చేస్తుంది. ఈ స్కూటర్ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ.1.24 లక్షలుగా నిర్ణయించబడింది కంపెనీ. ఇక ఈ కొత్త మోడల్ ఈవి బైకులు జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కంపెనీ మార్కెట్లో ప్రత్యేక మైలు రాయిగా నిలవాలని ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహాలను అనుసరిస్తోంది.

Also Read: Allu Arjun : మార్కో టీంను అప్రిషియేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

జితేంద్ర యూనిక్ మోడల్‌లో యూనిక్ లైట్, యూనిక్ ప్రో అనే రెండు కొత్త వేరియంట్లను అక్టోబర్ నాటికి అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఈవీ స్కూటీలు ప్రారంభ ధర రూ.92,000గా ఉంది. అలాగే టాప్ మోడల్ రూ.1.24 లక్షలుగా ధర ఉంది. ఈ స్కూటర్ 3.8 kW LMFP రిమోవెబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 118 కి.మీ. దూరం ప్రయాణించగలదు. అలాగే ఇది 75 కి.మీ. గరిష్ట వేగంతో నడుస్తుంది. అలాగే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, 12 అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లు, అలాయ్ వీల్స్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే కీలెస్ ఎంట్రీ, USB ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్ డిజిటల్ LED క్లస్టర్, Chrome Arc LED హెడ్ ల్యాంప్స్, Radiant Hex LED టెయిల్ ల్యాంప్స్, ఈగల్ విజన్ LED బ్లింకర్స్ ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: ZEE Telugu: సంక్రాంతికి ప్రేక్షకుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపేందుకు వచ్చేస్తున్న జీ తెలుగు..

ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన బ్యాటరీ ఉంటుంది. JENi యాప్‌తో అనుసంధానించబడిన ఈ బ్యాటరీ థర్మల్ ప్రొపగేషన్ అలర్ట్‌ను అందిస్తుంది. ఇది వినియోగదారులకు మెరుగైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇక కామపీనీ వినియోగదారుల కోసం యాక్సెసరీస్ ప్రత్యేకంగా తయారు చేయబడింది. స్టోరేజ్ అవసరాలకు యునికేస్ బ్యాగ్, బ్లూటూత్ కనెక్టివిటీతో కాల్స్, మ్యూజిక్, నావిగేషన్ సదుపాయాలు, పంక్చర్ సమయంలో ఉపయోగపడేలా యునికార్ట్ బూస్టర్ అందించనున్నారు. బ్యాటరీపై మూడేళ్ల లేదా 50,000 కి.మీ. వరకు వారంటీని అందిస్తోంది.

Show comments