JioPhone Prima 4G Prepaid Plans: భారతీయ మార్కెట్ కోసం ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ నుంచి వచ్చిన తాజా ఫోన్ ‘జియోఫోన్ ప్రైమా’. ఐఎంసీ (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 2023లో ప్రదర్శించబడిన ఈ ఫోన్.. నవంబర్ ప్రారంభంలో ప్రారంభించబడింది. కస్టమర్లకు డిజిటల్ వసతులకు చేరువ చేయడమే లక్ష్యంగా జియో కంపెనీ ఈ 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. రూ.2,599 ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను.. సాధారణ జియోఫోన్ ప్లాన్లతో రీఛార్జ్ చేయడం కుదరదు. జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్లాన్‌లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
జియోఫోన్ ప్రైమా కోసం మొత్తం ఏడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ల ధర రూ. 75, రూ. 91, రూ. 125, రూ. 152, రూ. 186, రూ. 223 మరియు రూ. 895గా ఉన్నాయి. ఈ ప్లాన్‌లన్నీ డేటా ప్రయోజనాలతో వస్తాయి. డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు, సబ్‌స్క్రిప్షన్ లాంటి ప్రయోజాలను పొందవచ్చు.
రూ.75 ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 23 రోజులు. రోజుకి 100ఎంబీ + 200ఎంబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 50 ఎస్‌ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
రూ.91 ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా.. రోజుకి 100ఎంబీ + 200ఎంబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 50 ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.
రూ.125 ప్లాన్:
ఈ ప్లాన్‌లో రోజుకి 0.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 23 రోజులు కాగా.. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.
రూ.152 ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా.. రోజుకి 0.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌లు సహా జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.
Also Read: NEET Student Dies: కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 28కి చేరిన మరణాలు!
రూ.186 ప్లాన్:
ఈ ప్లాన్‌లో రోజుకి 1జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అదనం. వ్యాలిడిటీ 28 రోజులు.
రూ.223 ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా.. రోజుకి 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లతో సహా జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.
రూ.895 ప్లాన్:
ఈ ప్లాన్‌లో రోజుకి 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 50 ఎస్‌ఎంఎస్‌లు. వ్యాలిడిటీ 336 రోజులు కాగా.. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అదనం.