NTV Telugu Site icon

JioHotstar: జయహో.. జియోహాట్‌స్టార్! 100 మిలియన్ల మార్కు టచ్

Jiohotstar

Jiohotstar

JioHotstar: భారతదేశంలో డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్ తన 100 మిలియన్ల సభ్యులను దాటి భారీ వినియోగదారుల బేస్‌ను ఏర్పరుచుకుంది. ఈ గణనీయమైన వృద్ధికి అనేక అంశాలు కారణమయ్యాయి. ముఖ్యంగా కంటెంట్ ఆఫర్‌లు అందుబాటు ధరలలో ఉండడం, మంచి యాక్సెస్ వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి.

Read Also: Viral Video: బెడ్రూంలోకి ఆవు, ఎద్దు.. కప్‌బోర్డులో చిక్కుకున్న మహిళ.. వైరల్ వీడియో..

ఇదివరకు డిస్నీ+ హాట్‌స్టార్ 2022 మే నాటికి 50.1 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది. అయితే జియోహాట్‌స్టార్ రూపంలో ఇది మునుపటి ప్లాట్‌ఫాంలు జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ను కలిపి కొత్త అవతారంలో గత నెలలో లాంచ్ చేయబడింది. అప్పటి నుంచి ఇది మరో 50 మిలియన్ల కొత్త వినియోగదారులను సంపాదించి మొత్తంగా 100 మిలియన్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. జియోహాట్‌స్టార్ వినియోగదారులకు విభిన్న రకాల వినోదాన్ని అందిస్తోంది. టెలివిజన్ షోస్, హాలీవుడ్ చిత్రాలు, వివిధ బాషల డిజిటల్ ఒరిజినల్స్, రియాలిటీ షోస్ వంటి అనేక కార్యక్రమాలను ఇందులో చూడొచ్చు. అలాగే ఈ మధ్యనే ప్రారంభించిన “స్పార్క్స్” భారతీయ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించే విధానంగా ఈ కొత్త కార్యక్రమం జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫాం కంటెంట్‌ను మరింత విస్తృతం చేసింది.

Read Also: Pushpa2TheRule : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా..

నిజానికి జియోహాట్‌స్టార్ వృద్ధికి క్రీడా ప్రసారాలు ప్రధాన కారణాలలో ఒకటి. ఇందులో ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వంటి ప్రముఖ టోర్నమెంట్ల ప్రసార హక్కులను కలిగి ఉంది. అంతే కాకుండా, ప్రీమియర్ లీగ్ (Premier League), విమ్బుల్డన్ (Wimbledon) వంటి అంతర్జాతీయ క్రీడలు మరియు ప్రో కబడ్డీ, ఇండియన్ సూపర్ లీగ్ (ISL) వంటి దేశీయ క్రీడా లీగ్‌లను కూడా ప్రసారం చేయడంతో జియోహాట్‌స్టార్ మరింత పురోగతి సాధించింది. కేవలం క్రీడలే కాదు, ఇతర ప్రముఖ ఈవెంట్ల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా ప్లాట్‌ఫాం తన వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా జియోహాట్‌స్టార్ విజయానికి టెలికాం భాగస్వామ్యాలు కూడా ముఖ్యమైన కారణంగా నిలిచాయి. సబ్‌స్క్రిప్షన్ మోడల్స్ ద్వారా విభిన్న వినియోగదారుల అవసరాలను తీర్చేలా ప్లాన్‌లను అందించాయి. ఈ విధంగా కంటెంట్, క్రీడలు, లైవ్ ఈవెంట్స్, అందుబాటు ధరలు వంటి కారణాలతో జియోహాట్‌స్టార్ భారతీయ స్ట్రీమింగ్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది.