NTV Telugu Site icon

Jio Recharge: గేమ్ ఛేంజర్.. రూ.1899కే 336 రోజుల వ్యాలిడిటీ

Jio

Jio

Jio Recharge: ఇంట్లో Wi-Fi, ఆఫీస్ లో Wi-Fi కారణంగా మొబైల్ డేటా వినియోగం చాలా తక్కువగా ఉంటే.. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్ ప్లాన్ కోసం వెతకడం చాలా సహజం. ఇందుకు తగ్గట్టు గానే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం, తక్కువ ధరలో ఎక్కువ చెల్లుబాటుతో ఉన్న రూ. 1899 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది తక్కువ డేటా వినియోగం ఉన్నవారికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా మీకు 24 GB హై-స్పీడ్ డేటా అందుతుంది. అంతేకాకుండా లోకల్, STD కాల్స్ కోసం అపరిమిత ఉచిత కాలింగ్ అందిస్తారు. అలాగే 3600 SMSల సౌకర్యం కూడా లభిస్తుంది.

Also Read: Introverts Day: ప్రతిదానికి మొహమాటపడిపోతున్నారా? వారిని ఏమంటారంటే..

ఈ రీఛార్జ్‌లో అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే.. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కి ఉచిత యాక్సెస్ అందుకుంటారు. అయితే, ఈ ప్లాన్‌లో జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉండదు. ఇక ఈ ప్లాన్‌ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది ఎక్కువ రోజులు చెల్లుబాటు కలిగి ఉండడం వల్ల డేటా పరిమితంగా ఉంటుందని గుర్తు ఉంచుకోవాలి. ఈ ప్లాన్‌ను తక్కువ డేటా వినియోగం కలిగిన వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కాబట్టి మీరు ఇంట్లో లేదా కార్యాలయంలో Wi-Fi వాడుతూ ఉంటే ఈ ప్లాన్ మీకు ఖచ్చితంగా సరిపోతుంది. తక్కువ ధరలో ఎక్కువ కాలపరిమితి కావాలని ఆశిస్తున్నవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ చాయిస్. ఇక ఈ రీఛార్జ్ ధర ఎక్కువ అనిపిస్తే.. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్‌లో అందుబాటులో ఉన్నాయి.

Show comments