Jio Sound Box : కొద్ది కాలంలోనే జియో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. టెలికాం మార్కెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ముఖేష్ అంబానీ మరికొద్ది రోజుల్లో యూపీఐ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. ఇంకా ఇందుకు సంబంధించిన కొంత సమాచారం గురించి తెలుసుకుందాము. ముఖేష్ అంబానీ త్వరలో జియో సౌండ్ బాక్స్ ని ప్రారంభించబోతున్నారు. మీరు ఈ సౌండ్ బాక్స్ లో అనేక సేవలను పొందుతారు. ఇక్కడ విశేషమేమిటంటే., దీని సహాయంతో మీరు ఎక్కడైనా చెల్లింపు చేయగలరు. ఇది పేటీఎం సౌండ్ బాక్స్ లాగా పని చేస్తుంది.
Harish Rao: నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ..
ఇకపోతే ఇప్పటికే మీకు జియో సౌండ్ బాక్స్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్న వచ్చే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అయితే అతి త్వరలో మార్కెట్ లోకి రాబోతోందన్న విషయం మాత్రం తెలిసింది. మీరు UPI చెల్లింపు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు Jio పేమెంట్ యాప్‌ని ఉపయోగించవచ్చు. ఈ యాప్ సహాయంతో చెల్లింపు చేయడం ద్వారా మీరు ఎలాంటి అదనపు చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు చాలా మంచి ఎంపిక అని భావించవచ్చు. యాప్ యొక్క సబ్‌స్క్రిప్షన్ కూడా జియో ద్వారా వినియోగదారులకు అందించబడుతుంది. దీని తర్వాత మీరు జియో యాప్ లను ఉపయోగించడం సులభం అవుతుంది.
Rangareddy: ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఏం చేశాడో తెలుసా..? ఇంత దారుణమా..?