Site icon NTV Telugu

Eluru Crime: యువతిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమోన్మాది మృతి!

Eluru Crime1

Eluru Crime1

Eluru Crime: ఏలూరులో జిల్లా సత్రంపాడులో ఓ ప్రేమోన్మాది యువతి గొంతుకోసి హత్యకు పాల్పడి.. ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఏలూరులో యువతి గొంతుకోసి ఆత్మహత్యకు పాల్పడిన యేసు రత్నం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సత్రంపాడులో యువతి గొంతు కోసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన కట్టిబోయిన యేసు రత్నం విజయవాడలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లికి ఒప్పుకోలేదని కారణంతో రత్న గ్రేసీపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

Read Also: Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతుకోసి హత్య.. ఆపై!

అసలేం జరిగిందంటే.. సత్రంపాడులోని రత్న గ్రేసీ(22) అనే యువతిని ప్రేమించిన యువకుడు యేసురత్నం(23).. తిరిగి తనను ప్రేమించాలని ఆ యువతి వెంటపడ్డాడు. ఆమె ఇంటికి వెళ్లి తమ ఇద్దరికీ పెళ్లి చేయాలని ఆ యువతి తల్లిదండ్రులను అడిగాడు. దానికి వారి నిరాకరించడంతో పాటు యువతి కూడా ప్రేమించకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సరైన సమయం కోసం వేచి చూసి చివరికి ఆమెపై కత్తితో దాడికి దిగాడు. యువతిపై కత్తితో దాడి చేసిన తర్వాత తాను కూడా గొంతును కోసుకున్నాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. యువకుడు తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు కూడా మృతి చెందాడు. క్షణికావేశం ఇద్దరి నిండు ప్రాణాలను బలి తీసుకుంది.

Exit mobile version