Jharkhand CM: జార్ఖండ్ సీఎం జాడెక్కడ.. ఆచూకీ కోసం ఈడీ గాలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దాదాపు 18 గంటలుగా కనిపించకుండా పోయారు. ఆయన కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం వేచి చూస్తుంది. అయితే, నిన్న ఢిల్లీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ ఓ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుంది. అలాగే, మరి కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే, సీఎం హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు ఈడీ ఈ చర్యలకు పాల్పడుతుందని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) మండిపడుతుంది. మరోవైపు అరెస్టు భయంతో సీఎం సోరెన్ 18 గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, సీఎం సోరెన్ జనవరి 27న రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరి వచ్చారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లారని పార్టీ శ్రేణులు తెలిపారు.
Read Also: Student Suicide: కరీంనగర్ లో ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ఇక, భూ కుంభకోణం కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం అధికారిక నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించింది. అనంతరం జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. దీనికి స్పందిస్తూ సోరెన్ ఈడీకి లేఖ పంపారు.. అయితే తాను విచారణకు హాజరయ్యే తేదీని దానిలో పేర్కొనలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆదివారం (జనవరి 28) ఈడీకి పంపిన ఈ మెయిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ పని తీరును అడ్డుకోవడానికి రాజకీయ ఎజెండాతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం సోరెన్ ఆరోపించారు.
Read Also: Mrunal: మృణాల్ మత్తులో సోషల్ మీడియా!
అయితే, తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీకి లేఖ రాశారు. తాను బడ్జెట్ కసరత్తుపై బిజీగా ఉన్నాను.. ఫిబ్రవరి 2 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి.. ఈ నెల 31లోపు విచారణకు రావాలని ఎలా ఒత్తిడి చేస్తారు? దీన్ని బట్టి మీ దుర్భుద్ది ఏంటో అర్థమవుతోంది.. మీ చర్యలు హానికరమైనవి, రాజకీయంగా ప్రేరేపితమైనవి అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!