Jharkhand: మనుషుల పైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి, 10 మందికి తీవ్ర గాయలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తున్న మనుషుల గుంపు పైకి కారు దూసుకుపోయింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని రాంచీకి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరాన్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిందని పోలీసులు తెలిపారు..
కారులోని వ్యక్తి నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు.. పవిత్ర శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా వేరే గ్రామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన వారు తిరిగి తమ ఇళ్లకు వెళ్తున్న సమయంలో మృత్యువు కబలించింది.. తీవ్రంగా విషాదాన్ని నింపింది.. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులను ఉదల్ చౌరాసియా (34), రోహిత్ చౌరాసియా (45), మధు మెహతా (30)గా గుర్తించారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
అదనపు పోలీసు సూపరింటెండెంట్ రిషవ్ గార్గ్ మాట్లాడుతూ, ఈ ఘటనలో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు మేదినిరాయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు వెళ్లారు.. కేసు నమోదు చేసుకొని మృతులను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ సంఘటన తర్వాత డ్రైవర్ కారుతో పరారయ్యాడు.. అతనిని పట్టుకోవడానికి మాన్‌హాంట్ ప్రారంభించబడింది.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!