NTV Telugu Site icon

Jharkhand Assembly Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, మిత్రపక్షాల సీట్ల ఖరారు

Jharkhand Assembly Elections

Jharkhand Assembly Elections

Jharkhand Assembly Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే సీట్లు ఖరారయ్యాయి. ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో పోటీ చేయనుండగా, జేడీయూకి 2 సీట్లు ఇచ్చారు. చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్‌జేపీకి చత్రా ఒక సీటు ఇవ్వగా, మిగిలిన 68 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. జార్ఖండ్‌లో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని కేంద్ర మంత్రి, జార్ఖండ్‌కు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందుకు సంబంధించి సీట్ల పంపకం ఖరారైందని, అతి త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన అన్నారు.

Robbery: రైతు ఇంట్లో కోటి రూపాయల దొంగతనం.. నిందితులను పట్టించిన పోలీస్ డాగ్

ప్రధాని మోడీ నాయకత్వంలో ఈ ఎన్నికలు జరుగుతాయని అస్సాం ముఖ్యమంత్రి, జార్ఖండ్ బీజేపీ ఎన్నికల కో-ఇన్‌చార్జ్ హేమంత్ బిస్వా శర్మ అన్నారు. ఇందులో భాగంగా ఏజేఎస్‌యూ సిల్లి, రామ్‌ఘర్, గోమియా, ఇచాగర్, మండూ, జుగ్సాలియా, డుమ్రీ, పాకుర్, లోహర్‌దగా, మనోహర్‌పూర్ స్థానాల్లో రంగంలోకి దిగనుంది. జేడీయూ జంషెడ్‌పూర్ వెస్ట్, తమర్ స్థానాల్లో పోటీ చేయనుంది. చత్రా నుంచి ఎల్‌జేపీ ఒక స్థానంలో పోటీ చేయనుంది.

Fire Accident: ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఐసీయూలో రోగి మృతి

జార్ఖండ్‌లో రెండు దశల్లో ఓటింగ్ జరుగనున్నాయి. చివరగా నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, రెండో దశలో నవంబర్ 20న 38 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.