Site icon NTV Telugu

Jet airways: మనీలాండరింగ్ కేసులో ఊరట.. నరేష్ గోయల్‌కు మధ్యంతర బెయిల్

Jetr

Jetr

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు న్యాయస్థానంలో తాత్కాలిక ఉపశమనం లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు 2 నెలల మధ్యంతర బెయిల్‌ను బాంబే హైకోర్టు మంజూరు చేసింది. వైద్యపరమైన కారణాలతో ఆయనకు ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. రూ. 1లక్ష పూచీకత్తు సమర్పించాలని.. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ముంబై వదిలి వెళ్లరాదని జస్టిస్ ఎన్‌జీ జమాదార్‌తో కూడిన సింగల్ బెంచ్ పేర్కొంది. అలాగే పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని నరేష్ గోయల్‌కు బాంబే హైకోర్టు ఆదేశించింది.

ఇది కూడా చదవండి: K Laxman: మిగిలేది గాడిద గుడ్డే.. రాజ్యసభ సభ్యులు లక్ష్మన్ ఘాటు విమర్శలు..

నరేష్ గోయల్ (75), అతని భార్య అనితా గోయల్ ఇద్దరూ క్యాన్సర్‌తో బాధపడుున్నారు. మానవతా దృక్పథంతో వైద్యం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. గోయల్‌ తరపు న్యాయవాది హరీశ్‌ సాల్వే ఈ కేసును మానవతా దృక్పథంతో పరిగణించాలని కోర్టును కోరారు. దీంతో హైకోర్టు రెండు నెలల మధ్యంతర బెయిల్‌ను సింగిల్ బెంచ్ ఇచ్చింది. నచ్చిన ప్రైవేటు ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో ప్రత్యేక న్యాయస్థానం గోయల్‌కు బెయిల్‌ను నిరాకరించింది.

ఇది కూడా చదవండి: Anna Rambabu: జగనన్న మళ్లీ సీఎం అయితేనే మంచి జరుగుతుంది..

Exit mobile version