Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
- ఎన్విడియా కేసులో మరో ట్విస్ట్..
- జెన్సన్, ఆలిస్‌ను కలిపింది ఆమె భర్తనే..
- ఇద్దరి మధ్య సంబంధం గురించి ముందే కాంగ్‌కు తెలుసు..
- చైనాకు ఏఐ చిప్స్ తరలించినట్లు ఆలిస్పై ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nvidia Scandal: ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఎన్విడియా వ్యవహారం సంచలనంగా మారింది. ప్రముఖ ఏఐ చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఎఫైర్, చైనాకు ఏఐ చిప్స్ సరఫరా ఆరోపణలు సంచలనంగా మారాయి. చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్ ఇటీవల ఎఫైర్ ఉన్నట్లు ప్రకటించారు. అయితే, ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆలిస్ భర్త అయిన చైనా వ్యాపావేత్త కాంగ్ వీనే తన భార్యను జెన్సన్కు పరిచయం చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. జెన్సన్‌తో సుమారు 10 ఏళ్లుగా పరిచయం ఉన్న కాంగ్ వీ, తన భార్యకు జెన్సన్కు మధ్య సంబంధం ఉందని ముందే తెలుసని, ఈ విషయాన్ని ఆయన తన పరిచయస్తులతో ప్రస్తావించేవాడని పేర్కొంది.
జెన్సన్‌తో సంబంధంపై దర్యాప్తు..
జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్‌కు ఉన్న సంబంధంపై అమెరికా, సింగపూర్, తైవాన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్విడియా చిప్స్‌ను చైనాకు ఆలిస్ తరలించిందని, ఆమె చైనాకు గూఢచర్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చిప్స్ తరలించడానికి ఆలిస్, జెన్సన్‌తో ఉన్న సంబంధాన్ని వాడుకున్నట్లు తెలుస్తోంది. చైనా నిఘా సంస్థలు ఆలిస్‌ను తమకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తిగా నియమించుకున్నాయా? అనే కోణంలో అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
- North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
- Donald Trump: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 93 శాతం కాదు, 100 శాతం విజయం సాధిస్తాం!
- Pakistan Terror Attack: పాకిస్థాన్‌లో ఘోర ఉగ్రదాడి.. DSP, సబ్ ఇన్స్పెక్టర్ సహా 10 మంది పోలీసుల మృతి
జెన్సన్ పదవి ఊడే అవకాశం..
గత ఆదివారం తన సంబంధం గురించి జెన్సన్ ప్రకటించారు. ఉద్యోగులకు రాసిన లేఖలో జెన్సన్.. తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు అంగీకరించారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది నమ్మకాన్ని దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు ఆయనను సీఈఓ పదవి నుంచి తొలగించే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఆలిస్ కంపెనీ మెగాస్పీడ్పై అమెరికా, సింగపూర్ దర్యాప్తు..
సింగపూర్‌కు చెందిన క్లౌడ్ సేవల సంస్థ మెగాస్పీడ్పై అమెరికా, సింగపూర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ ఎన్విడియా ఏఐ చిప్స్‌ను చైనాకు ఇతర మార్గాల ద్వారా తరలించారా? అనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. మెగాస్పీడ్ ఎన్విడియా చిప్స్‌తో పనిచేసే కొన్ని సర్వర్లను చైనాకు పంపినట్లు, దీని ద్వారా అమెరికా ఎగుమతి ఆంక్షల్ని తప్పించుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, తైవాన్ అధికారులు ఆలిస్ హువాంగ్ ఎంట్రీ అనుమతిని రద్దు చేసి, దేశంలోకి రాకుండా నిషేధించారు. తైవాన్‌లోనే జెన్సన్ను ఆలిస్ పలుమార్లు కలిసినట్లు నివేదికలు ఉన్నాయి. ఆ సమయంలో ఆమె నిఘా కార్యక్రమాలకు పాల్పడిందా.? తైవాన్ వ్యతిరేక చొరబాటు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారా? అనే దానిపై ఆ దేశ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
2025 వేసవిలో సింగపూర్ అధికారులు ఆలిస్‌ను అదుపులోకి తీసుకుని, దేశం విడిచి వెళ్లకుండా నిరోధించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆ తర్వాత ఆమెపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె చైనాలో ఉన్నట్లు పేర్కొంది. మెగాస్పీడ్పై దర్యాప్తు కొనసాగుతోందని సింగపూర్ అధికారులు తెలిపారు. అయితే, చైనాతో ఆలిస్‌కు ఉన్న సంబంధాలపై విచారణ జరపలేదని చెబుతున్నారు.
తాజావార్తలు
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
-
Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
-
Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!